ఆంధ్రప్రదేశ్‌

రైల్వే గ్యాంగ్‌మాన్ అవయవదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: బ్రెయిన్‌డెడ్‌కు గురైన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు మంచిమనసుతో దానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌కు చెందిన రైల్వే గ్యాంగ్‌మెన్ మేఘావత్ చిన్నస్వామి నాయక్ (44)కు ఆరు నెలల క్రితం తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నాటి నుంచి చికిత్స పొందుతూ వస్తున్నాడు. తిరిగి రెండోసారి ఈనెల 21 తేదీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. కుటుంబ సభ్యులు తక్షణం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయినా ఎటువంటి ఫలితం లభించక మెరుగైన వైద్యం కోసం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అన్ని రకాల వైద్య పరీక్షలనంతరం బ్రెయిన్ డెత్‌గా నిర్ధారణకు వచ్చారు. నాయక్ భార్య లక్ష్మి, కుమార్తె కల్యాణిదుర్గల అంగీకారం మేరకు జీవన్‌ధాన్ చైర్మన్ డాక్టర్ టి.రవిరాజు, జీవన్‌ధాన్ సిఇవో డాక్టర్ కృష్ణమూర్తి, మణిపాల్ హాస్పిటల్ విజయవాడ యూనిట్ హెడ్ టి.మురళీరావు ఆధ్వర్యంలో అవయవదానం జరిగింది. ఇందులో కాలేయాన్ని మణిపాల్ ఆసుపత్రికి, నేత్రాలను ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అప్పగించారు. రెండు కళ్లను ఇద్దరు అంధులకు అమర్చి కంటిచూపు అవకాశం కల్పించవచ్చని వైద్యులు చెప్పారు.