ఆంధ్రప్రదేశ్‌

మెరుగైన వైద్యం, పరిశుభ్రతకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందించడంతోపాటు ప్రధానంగా పరిశుభ్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఏపి వైద్యసేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి తెలిపారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మందులు, వైద్యపరికరాల కొనుగోలు నుంచి పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక వరకు పారదర్శకతతో జరుగుతాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. స్వాతంత్య్రానంతరం తొలిసారిగా సిఎం చంద్రబాబు, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ల నేతృత్వంలో గడచిన మూడేళ్లుగా ఎన్నో సంస్కరణలు చోటుచేసుకుని అన్ని రకాల మందులు అందుబాటులోకి రావటంతో ఔట్ పేషెంట్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు. కనీస వౌలిక సదుపాయాల కల్పనతోపాటు భవనాల నిర్మాణం కోసం ప్రతి జిల్లాలోనూ తమ సంస్థలో ఒక ఇంజనీరింగ్ విభాగం ఉన్నదన్నారు. ఆదాయం పెంపుదల కోసం ఇతర ప్రభుత్వ శాఖల నుంచి టెండర్ల ద్వారా కాంట్రాక్ట్‌లు పొందుతున్నామని అన్నారు.
తమ సంస్థకు నిధుల కొరత లేదని, గత ఏడాది దాదాపు రూ.1400 కోట్లు ఖర్చు చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే వంటి ఆధునిక యంత్రాలు కొనుగోలు చేయటంతోపాటు వాటి నిర్వహణ కోసం ఆపరేటర్లను కూడా నియమిస్తామన్నారు. గుంటూరు ఆసుపత్రిలో రోజూ సగటున ఓపిల సంఖ్య వెయ్యి నుంచి నాలుగు వేలకు పెరిగిందన్నారు. వాస్తవానికి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ప్రభుత్వాసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం లభిస్తున్నదని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొనసాగుతున్న తమ కార్యాలయాన్ని మంగళగిరికి తరలిస్తున్నామని, మరో పది రోజుల్లో పూర్తిస్థాయిలో పనిచేయగలదన్నారు. పరిశుభ్రత కోసం రోగులకు రోజుకో దుప్పటి అందిస్తున్నామన్నారు. ప్రతి ఆసుపత్రిలో జనరిక్ మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టామన్నారు. విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి పి.దిలీప్ పాల్గొన్నారు.