ఆంధ్రప్రదేశ్‌

అభద్రతా భావనలో బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూన్ 24: సిఎం చంద్రబాబు అభద్రతా భావనలోకి చేరుకున్నారని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి ఎద్దేవ చేశారు. నంద్యాల పట్టణంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు. శనివారం వైఎస్‌ఆర్‌సి నెల్లూరుజిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లేయని పక్షంలో ప్రభుత్వం తరపున పింఛన్లను అందుకోవద్దని, రోడ్లపై నడవొద్దని చంద్రబాబు చెప్పడం విడ్డూరమన్నారు. ప్రమాణ స్వీకార సందర్భంలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తానని బాస చేసిన చంద్రబాబు ఇప్పుడు తన, పర అనే మనస్థత్వ ధోరణి ప్రదర్శించడం గర్హనీయమన్నారు. ఎంతో సీనియర్ సీఎం నోట ఇలాంటి మాటలు ఆయన భవిష్యత్‌పై బెంగతోనేనని స్పష్టం చేశారు. మరో రెండేళ్లలో వచ్చే ఎన్నికల్లో టిడిపి ఘోర పరాజయానికి ఆ పార్టీ అధినేతగా సిఎం బాబు చేస్తున్న వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ఆయన అవసరమైతే ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనంటూ వ్యాఖ్యానించడం అప్రజాస్వామికమన్నారు. అలా ఓటర్లకు భారీ మొత్తాలు ఇచ్చేందుకై అంతటి సొమ్ము ఆయనకు ఎలా చేకూరిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెపుతూ కేంద్ర సహాయాన్ని కోరుతున్నా రెవెన్యూలోటు వివరాల్లో ఆద్యంతం అవకతవకలు ఉన్నాయన్నారు.