ఆంధ్రప్రదేశ్‌

మీకిచ్చిన సదుపాయాల గురించి చెప్పరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ‘పదవి ఇచ్చిన ముఖ్యమంత్రిపైనే తప్పుడు ప్రచారం చేయడం భావ్యమేనా?’ అంటూ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఎవి రమణ ప్రశ్నించారు. కార్పొరేషన్ చైర్మన్ హోదాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎంతవరకూ సమంజసంమని నిలదీశారు. చైర్మన్ వ్యక్తిగత సేవలకోసం 12 మందిని నియమించి వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోందని గుర్తుచేశారు. రూపాయి జీతం కూడా తీసుకోవడం లేదన్న వ్యక్తి దీనికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. చైర్మన్ హోదాలో ఒక పిఎస్, ఒక అదనపు పిఎస్, ఇద్దరు డ్రైవర్లు, పిఎ, ముగ్గురు అటెండర్లు, ముగ్గురు స్వీపర్లు, ఒక జమేదారును ఇచ్చారని, కారు, పెట్రోల్ అలవెన్సు, స్పెషల్ అలవెన్సు, సొంత కారు కొనుక్కోడానికి 10 లక్షల రూపాయల అడ్వాన్సు, ఇంట్లో గినె్నలు కొనుక్కోడానికి లక్షన్నర ఫ్రీ గ్రాంట్, ఫర్నిచర్ కొనుగోలుకు 3లక్షలు, ల్యాప్‌టాప్‌కి రూ.50వేలు, అన్ లిమిటెడ్ బిల్లింగ్‌తో మూడు ఫోన్లు, రెండు సెల్‌ఫోన్లు, కుటుంబానికి ఉచిత వైద్యసేవలు వంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వ నిధులతో ఇన్ని అనుభవిస్తూ బ్రాహ్మణ సమాజాన్ని తానేదో ఉద్ధరిస్తున్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ప్రభుత్వం 200 కోట్ల రూపాయలు కేటాయించిందని చెపుతూ గుంటూరులో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ అంటూ కొందరు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కొందరు తమ ఉనికికోసం పెట్టిన రాజకీయ సభ అని ధ్వజమెత్తారు. రాజకీయ స్వార్థపరుల పట్ల బ్రాహ్మణులు అప్రమత్తంగా ఉండాలని రమణ హెచ్చరించారు.