ఆంధ్రప్రదేశ్‌

నంద్యాల ఉపఎన్నికలో ధనప్రవాహం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూన్ 25: కర్నూలు జిల్లాలోని నంద్యాల శాసనసభా స్థానానికి ఉపఎన్నిక అనివార్యమని తేలడంతో నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో పెద్దఎత్తున నగదు ప్రభావం ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఉపఎన్నికల్లో విజయాన్ని భూమా, శిల్పా కుటుంబాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల కొనుగోలుకు ఎంత ఖర్చయినా పెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు సైతం అనుమానిస్తున్నారు. ఉపఎన్నికల్లో తమకు ఓటు వేస్తే ఓటుకు రూ. 2వేలు, తమ నేత జీవించి ఉన్నంత కాలం కేబుల్ టీవీ ప్రసారాలకు రుసుము వసూలు చేయబోమని ఒక వర్గం ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. దానికి దీటుగా మరో వర్గం కూడా తమదైన ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రచారం చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల వేళ నిఘా ఉంటుందన్న ఉద్దేశంతో ఇప్పటి నుంచే సురక్షిత ప్రాంతాల్లో నగదు నిల్వ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారని నంద్యాల పట్టణంలో ఏ ఇద్దరు కలిసినా చర్చించుకోవడం గమనార్హం. ఇటీవల నంద్యాలలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో మఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని అయితే ఆ సొమ్ము తిరిగి రాబట్టడానికి తాను అవినీతికి పాల్పడాల్సి వస్తుందని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టిన పథకాలతో లబ్ధి పొందుతున్నవారు టిడిపికి ఎందుకు ఓటెయ్యరని ఆయన ప్రశ్నించారు. ఈ మాటలను వైకాపా, కాంగ్రెస్ పార్టీలు తప్పుపడుతూ చంద్రబాబు ఓటర్లను బెదిరిస్తున్నారని విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏకంగా చంద్రబాబుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. అయితే తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రజలను కోరాలని కార్యకర్తలకు సూచించామే కానీ అందులో మరో ఉద్దేశం లేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను ఒక వర్గం వక్రీకరించి ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలను వైకాపా తీవ్రంగా పరిగణిస్తూ ఓటుకు రూ.5వేల చొప్పున టిడిపి పంపిణీ చేస్తుందని, దీన్ని దీటుగా ఎదుర్కొనాలని అంతర్గత సమావేశంలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
నంద్యాల ఉపఎన్నికల్లో ధన ప్రవాహంపై సాగుతున్న చర్చతో జిల్లా పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఓటుకు నోటు పంపిణీ జరుగుతుందన్న ప్రచారంతో నియోజకవర్గంలోని నేతలపై, వారి కదలికలపై నిఘా ఉంచారు. ఎన్నికల సమయానికి ఆయా నేతల ఇళ్లు, కార్యాలయాలు, ఇతర రహస్య ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు అధికారులు వెల్లడిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికల పర్యవేక్షణకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక అధికారులను నియమించనుందని వెల్లడవుతోంది. వారి ఆధ్వర్యంలో నగదు ప్రవాహాన్ని అడ్డుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుని ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించగలమని వారు స్పష్టం చేస్తున్నారు.