ఆంధ్రప్రదేశ్‌

ఎంఎస్‌ఎంఇకి ప్రత్యేక కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూన్ 25: రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఇ)కి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ్‌రెడ్డి తెలిపారు. ఆదివారం చిత్తూరు జిల్లా పూతలపట్టులో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ రంగం తరువాత ఎంఎస్‌ఎంఇ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందన్నారు. యునైటెడ్ నేషన్స్ ఈనెల 27న అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎంఇ) ఎంటర్‌ప్రైజస్ డేగా ప్రకటించిందని దీనిని పురస్కరించుకుని విజయవాడలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హాజరుకానున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగాన్నికన్నా అత్యంత ప్రాధాన్యత కల్గిన ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. చదువుకున్న యువతీ యువకులు అందరికీ ఎంఎస్‌ఎంఇల ద్వారా ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఒక పార్క్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో 26,198 కోట్ల పెట్టుబడితో 1.10 లక్షల ఎంఎస్‌ఎంఇల ద్వారా 9.11 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఇందుకోసం 121 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో ప్రతిపాదించామన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను దశలవారిగా ఎంఎస్‌ఎంఇ పార్క్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 101 నియోజకవర్గాల్లో స్థలాలు గుర్తించామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ప్రపంచ వ్యాప్తంగా అనేక సమస్యలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని తెలిపారు. దేశంలోనే పెట్టుబడులు ఆకర్షించే రాష్ట్రంగా ఎపి అగ్రగామిలో ఉందన్నారు. ఇప్పటికి రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 24,400 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులు కేటాయించామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఎవరు ముందుకొచ్చినా ప్రభుత్వపరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో మహిళల కోసం నెల్లూరులో మహిళా పారిశ్రామికవాడను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మహిళలు కూడా ఈ రంగంలో రాణించే వారికే అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గడిచిన మూడేళ్ల నుంచి 19,193 ఎంఎస్‌ఎంఇల ద్వారా 8,738 కోట్ల పెట్టుబడులతో 2.26 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. చదుకున్న ప్రతి యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్న ఉద్దేశంతో ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వదలచామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి 270 కోట్ల రూపాయలను రాయితీగా ఇస్తున్నట్లు వివరించారు. వెనుకబడిన వర్గాలకు చేయూతనిచ్చే దిశగా చర్యలు చేపడతామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 15 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.