ఆంధ్రప్రదేశ్‌

రూ.25వేల కోట్లతో ఆరులేన్ల రహదారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 25: రాష్ట్రం లో అమరావతి నుంచి అనంతపూర్ వరకు ఆరులేన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరయ్యాయని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. కేంద్రం రూ.27వేల కోట్లు ఖర్చు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు. ఇక్కడ జెడ్పీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే మొదటిసారిగా ఆరులేన్ల జాతీయ రహదారి ఏర్పాటు చేయడం ఇదొక్కటేనన్నారు. ఎక్కడా మలుపులు లేకుండా నేరుగా రోడ్డు నిర్మాణం ఉంటుందని చెప్పారు. ఇందులో ప్రతి వంద కిలోమీటర్లకు ఒక టౌన్‌షిప్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి, ప్రధాని మోదీ సహకారంతో ఇది సాధ్యమైందని తెలిపారు. ఇందులో 75 శాతం భూసేకరణ పూర్తయ్యిందని వివరించారు. రాజమండ్రి-విజయనగరం వరకు గల రాష్ట్ర రహదారి 400 కి.మీ జాతీయ రహదారిగా మార్పు చేసినట్టు మంత్రి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ఈ రోడ్డు రాజమండ్రి నుంచి రంపచోడవరం, కొయ్యూరు, లంబసింగి, చింతపల్లి, పాడేరు, అరకు, బౌడారా మీదుగా విజయనగరం వై జంక్షన్ వరకు ఉందన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రేడియం స్టిక్కరింగ్ ఏర్పాటు చేస్తున్నప్పటికీ అవి ఏడాది కూడా ఉండటం లేదని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఈ దృష్ట్యా ఈ దఫా వేరే కాంట్రాక్టర్‌కు ఆ పని అప్పగించామని ఐదేళ్లపాటు నిర్వహణ కూడా కాంట్రాక్టర్‌దే బాధ్యతని ఆయన వివరించారు. త్వరలోనే అవసరమైన అన్ని చోట్ల స్టిక్కరింగ్ ఏర్పాటు చేస్తారని ఆయన వివరించారు.