ఆంధ్రప్రదేశ్‌

నాకొదిలేయండి చూసుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: ‘మీరు చెప్పింది ఓపికతో విన్నాను. సమస్యను నాకు వదిలివేయండి. నేను న్యాయం చేస్తాను’ అంటూ తనను కలిసిన పశ్చిమ గోదావరి వాసులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. గోదావరి అక్వా మెగాఫుడ్ పార్క్‌ను తమ ప్రాంతంలో వద్దని, వేరే చోటికి తరలించాలని పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రు, కె.బేతపూడి, జోన్నల గరువు, భీమవరం, నరసాపురం గ్రామాల ప్రజలు మంగళవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. అక్వా ఫుడ్ పార్క్ వల్ల డ్రెయిన్లు కలుషితమవుతున్నాయని, మత్స్యకారులు ఉపాధి కోల్పోతారని తెలిపారు. ఆయా గ్రామాల ప్రజల కష్టాన్ని ఓపిగ్గా విన్న సిఎం, దీనిపై అధ్యయనం చేశాక నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఒక వ్యక్తి లేదా కొందరి ప్రయోజమాల కోసం పని చేయడం లేదని, పరిశ్రమలను వ్యతిరేకిస్తున్నామన్న భావన వస్తే, పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టరని సిఎం తెలిపారు. అటువంటి సంకేతాలు ఇవ్వకుండా, అధ్యయనం చేసి ఏం చేయాలో ఆలోచిస్తానన్నారు. ప్రజలను కష్టపెట్టనని, తమ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పశ్చిమ గోదావరి కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారని, వారి మాట మీద తనకు విశ్వాసం ఎక్కువన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రతి ఎకరాకు నీరు ఇస్తామన్నారు. ఆ గ్రామాల ప్రజలకు ఇబ్బంది రాకుండా చేస్తానని, పరిశ్రమలు వద్దంటే నష్టపోయేది ప్రజలేనన్నారు. మత్స్యకారులకు ఇబ్బందులు వస్తే, ఆదుకుంటున్నది తమ ప్రభుత్వమేనన్నారు. బొండాడ, యనమదుర్రు, కొల్లేరు డ్రైన్లు కలుషితం కాకుండా చూస్తామని తెలిపారు.