ఆంధ్రప్రదేశ్‌

తెరుచుకుంటున్న మద్యం దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: మద్యం నూతన పాలసీ అమల్లోకి వచ్చిన మూడో రోజైన సోమవారం నాటికి రాష్ట్రంలో దాదాపు 50 శాతానికి పైగా మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు మాత్రం తక్కువ సంఖ్యలోనే తెరిచారు. తొలిదశలో రెన్యువల్స్ పొందిన పాత బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు క్రమేణా తెరచుకుంటున్నాయి. కొత్త ప్రదేశాల్లో, కొత్త భవనాల్లో లైసెన్స్ పొందిన మద్యం వ్యాపారులు నిబంధనల మేరకు తమ తమ దుకాణాలను సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 737 బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటే వాటిలో జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న దాదాపు 500 పైగా రెస్టారెంట్లు మూతబడ్డాయి. మిగిలిన బార్లు మాత్రం తెరిచారు. ఇవన్నీ మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. సందట్లో సడేమియాలా గత నెల 30 తేదీ అక్రమంగా నిలువ చేసుకున్న సరుకును తెచ్చుకుంటూ పుల్ బాటిల్‌కు కనీసం రూ.80లు వరకు పెంచి విక్రయిస్తున్నారు. చీప్‌లిక్కర్‌పై కూడా ఎంతో కొంత భారం పడుతున్నది. నూతన పాలసీలో కొన్ని రకాల మద్యం ధరలు అధికారికంగానే పెంచారు. ఎక్సైజ్ డిపోల్లోని పాత సరుకుపై ఎంఆర్‌పి రేట్లను సవరించే స్లిప్‌లు అంటిస్తున్నారు. అయితే మద్యం వ్యాపారుల వద్ద మరో మూడు రోజులపాటు నిల్వలు ఉండే పరిస్థితి కన్పిస్తోంది. రాష్ట్రంలో మొత్తం 4వేల 388 వైన్‌షాపులుంటే ప్రధాన రహదారుల వెంబడి ఉన్న దాదాపు రెండువేలకు పైగా మూతబడ్డాయి. మిగిలిన అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రదేశం మారిన వైన్‌షాపులు ఇప్పుడిప్పుడే తెరచుకుంటున్నాయి. తెరచిన వైన్‌షాపులకు పర్మిట్ రూమ్‌లు లేకపోవటంతో చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లోనే మద్యం సేవిస్తున్నారు. ఇసుక వేస్తే రాలనంతగా వైన్‌షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగానున్న ఎక్సైజ్ డిపోల నుంచి మూడోరోజైన సోమవారం దాదాపు రూ.50 కోట్ల విలువైన సరుకు అమ్ముడు పోయింది. మొత్తంపై ఈ మూడు రోజుల్లో రూ.120 కోట్లు విలువైన సరుకు మార్కెట్లోకి వచ్చేసింది.