ఆంధ్రప్రదేశ్‌

స్ఫూర్తిదాత అల్లూరి, ధన్యజీవి పింగళి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు తరతరాల స్ఫూర్తిదాత అని, రంపపోరుతో వలసపాలకులపై తదుపరి పోరాటాలకు మార్గదర్శనం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. జూలై 4న అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి స్ఫూర్తిని ముఖ్యమంత్రి జ్ఞాపకం చేసుకున్నారు. అల్లూరి పోరాటం కేవలం ఆంధ్రకు పరిమితం కాలేదని, దేశంలో వలస పాలకుల చెర నుంచి విముక్తి కోసం జరిగిన అనేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిందని కొనియాడారు. అరకు కాఫీ తోటల సాగుతో లక్షమంది గిరిజనుల జీవితాల్లో వెలుగు నింపుతున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ‘ట్రైబల్ రిఫార్మ్ యార్డుస్టిక్’ను రూపొందించిందని చంద్రబాబు తెలిపారు. విశాఖ జిల్లా కాపులుప్పాడలో అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు.
మహనీయుడు పింగళి
ఎగురుతున్న జాతీయ జెండా మనదే అని సగర్వంగా చాటుకునేలా చేసిన మహనీయుడు పింగళి వెంకయ్య అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతించారు. త్రిపర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి ధన్యజీవి అని కొనియాడారు. జూలై 4న పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భాన ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకయ్య స్మతికి నివాళులు అర్పించారు. 1916లో లక్నోలో తొలిసారి పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారన్నారు. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమాల్లో పాల్గొన్న దేశభక్తుడు పింగళి వెంకయ్య అని నివాళులర్పించారు.