ఆంధ్రప్రదేశ్‌

కోర్టు తీర్పును స్వాగతిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టడం సరికాదన్న అభిప్రాయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై మద్యం దుకాణాల యజమానులు ఆలోచించాలన్నారు. సదావర్తి భూములపై కోర్టు తీర్పును స్వాగితిస్తున్నామన్నారు. వేలం నోటీసులు జారీ చేసినప్పుడు అసెంబ్లీలో అనవసర ఆరోపణలు చేశారని, తమకున్న పరిధిలో వేలం నోటీసులు జారీ చేశామని గుర్తు చేశారు. వేలం నోటీసును హైకోర్టు సమర్థించిందని తెలిపారు. అదనంగా ఐదు కోట్ల రూపాయలు ఆదాయం లభిస్తున్నప్పుడు కోర్టు తీర్పుపై వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.