ఆంధ్రప్రదేశ్‌

విష ప్రయోగంతో 800 కోళ్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేదరమెట్ల, జూలై 4 : వ్యాపారపరంగా నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టగా విష ప్రయోగం జరగడంతో 800కి పైగా కోళ్లు మృతి చెంది నాలుగు లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిన సంఘటన ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం గుడిపాడు గ్రామంలో జరిగింది. బాధితుడు కొరిశపాడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం కొట్టే రవీంద్ర గత ఫిబ్రవరిలో తన వ్యవసాయ భూమిలో షెడ్‌ను నిర్మించి 1050కి పైగా నాటుకోళ్లను కొనుగోలు చేసి పెంపకాన్ని చేపట్టాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆరు గంటలకు రవీంద్ర తన షెడ్ కు వెళ్లే సరికి 800 కోళ్లకు పైగా మృతి చెంది ఉండటాన్ని గమనించాడు. విష ప్రయోగం జరిగి కోళ్లు మృతి చెంది ఉంటాయని భావించి కొరిశపాడు ఎస్‌ఐ వై శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరావు గ్రామానికి వెళ్లి కోళ్ళ ఫారాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన కోళ్లను బుధవారం కొరిశపాడు వైద్యాధికారిణి పరీక్షించారు. విష ప్రయోగంతో మృతి చెంది ఉంటాయా..? లేకు ఫుడ్ ఫాయిజన్ ద్వారా మృతి చెంది ఉంటాయా... అని నిర్థారణ చేయించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.