ఆంధ్రప్రదేశ్‌

వ్యాపారుల్లో జిఎస్టీ గందరగోళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 4: ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో జిఎస్టీ గందరగోళం నెలకొంది. ఏ పొరపాటు జరిగితే ఏ శిక్ష అనుభవించాల్సి వస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపధ్యంలో ఎందుకొచ్చిన వ్యాపారమంటూ కొంత మంది వ్యాపారాలకు దూరమయ్యే పరిస్థితి కూడా నెలకొంది. అయితే ప్రతీ వ్యాపారి కచ్చితంగా అకౌంటెంట్‌ను ఆశ్రయించాల్సిందే. చార్టెడ్ అకౌంట్లకు, అకౌంటెంట్లకు డిమాండు పెరిగింది. కంప్యూటర్, అకౌంటెంట్ లేకుండా వ్యాపారం ముందుకు సాగని పరిస్థితి ప్రస్తుతంవుంది. ఒక యజమాని పేరుతో ఒకే వ్యాపారం ఉండాలి. బినామీ పేర్లతో వ్యాపారాలు సాగించడానికి అవకాశంలేదు. ప్రతీ నెలా పదో తేదీలోగా పర్చేజింగ్ బిల్లులు, 20వ తేదీలోగా సేల్స్ బిల్లులు ఆన్‌లైన్‌లో లెక్కలు చూపించాల్సివుంది. ఎక్కడైనా ఏ చిన్న పొరపాటు తలెత్తినా శిక్ష భారీగా వుంటుంది. వ్యాపారులు పనె్నండు రకాల ఫారాలను పూర్తి చేయాల్సివుంది. ప్రస్తుతం మాన్యువల్‌గా చేసేందుకు కాస్తంత వెసులుబాటు లభించినట్టు తెలుస్తోంది. మూడు నెలల పాటు కాస్తంత వెసులుబాటు ఇచ్చినట్టు చెక్ పోస్టులు తదితరాలు ఎత్తివేసినప్పటికీ ఇదే అదనుగా కొంత మంది పెద్దోళ్ళు దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని విధంగా వ్యవహరిస్తారని, ఈ వెసులుబాటు కూడా బడా కార్పొరేట్ సంస్థలకే మేలు చేస్తుందని చిన్న వ్యాపారులు అంటున్నారు. జిఎస్టీని నిరసిస్తూ కొన్ని వ్యాపారవర్గాలు నిరవధిక బంద్‌ను పాటించేందుకు కూడా సన్నద్ధమవుతున్నాయి.
ఇదిలావుండగా జీతాలకు సంబంధించి జిఎస్టీ నుంచి మినహాయింపు వుంది. ప్రస్తుతం ఈ విధానమే కాస్తంత ఊరటగా కన్పిస్తోంది. దీంతో జీతాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. నెలకు రూ.21 వేల జీతం దాటిన ఉద్యోగులు ఇఎస్‌ఐ, పిఎఫ్ పరిధిలోకి రారు. వీరికి కేవలం వృత్తి పన్ను మాత్రమే ఉంటుంది. రూ.15వేల నుంచి 2వేల వరకు రూ.150 వృత్తి పన్ను, రూ.20వేలు దాటి ఆపై ఎంతైనా రూ.200లు మాత్రమే వృత్తి పన్ను చెల్లించాల్సి వుంది. గతంలో అయితే రూ.5000 జీతం దాటితే వృత్తిపన్ను వుండేది. 2015 ఏప్రిల్ నుంచి రూ.15వేలు జీతం దాటిన వారికి మాత్రమే వర్తించే విధంగా సవరణచేశారు. అయితే జిఎస్టీ నుంచి తప్పించుకోవడానికి జీతాలు పెంచేలా వ్యాపారులు మార్గాలు అనే్వషించుకున్నప్పటికీ అలాంటి ఉద్యోగులు ఆదాయ పన్ను పరిధిలోకి రావొచ్చు.
అందుకని మరోమార్గం కూడా ఆలోచన చేసినట్టు తెలిసింది. శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలన్నట్టుగా జీతాలు రెట్టింపుచేసి, సగం మొత్తం ఎటిఎంల ద్వారా తీసుకుని మరికొంత ఓచర్ పేమెంట్‌గా కూడా ఇచ్చేందుకు అవకాశాలున్నట్టు తెలుస్తోంది.