ఆంధ్రప్రదేశ్‌

కశ్యప పింఛన్ పథకం త్వరలో పునరుద్ధరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల కోసం ప్రవేశపెట్టిన కశ్యప పింఛన్ పథకాన్ని త్వరలో పునరుద్ధరించనున్నట్లు ఏపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య ప్రకటించారు. గొల్లపూడిలోని కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన 13 జిల్లాల కోఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అందరికీ మరింత చేరువయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు 1వ తరగతి నుంచి విదేశీ విద్య వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈసందర్భంగా గుంటూరు జిల్లా కోఆర్డినేటర్ శిరిపురపు శ్రీ్ధర్ ఆధ్వర్యంలో చైర్మన్‌ను ఘనంగా సత్కరించారు. సమావేశంలో వివిధ జిల్లాల కోఆర్డినేటర్లు చిత్రపు హనుమంతరావు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, రాణి శ్రీనివాస్, కె కుసుమకుమారి, సేరి రామయ్యపంతులు, రఘునందనరావు, సముద్రాల హనుమంతరావు, సూరంపూడి కామేష్, గండూరి మహేష్, బాలాజీ జనార్ధన్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.