ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై బాబుకు చిత్తశుద్ధి లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోయినప్పటికీ పోలవరం ప్రాజెక్ట్‌ను 2020లోపు పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఏమాత్రం కన్పించడం లేదని రాజమంత్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు ఏవిధంగానూ నష్టం జరగరాదనే ఉద్దేశంతో రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేక పోతున్నారని, దీనికి ఓటుకు నోటు కేసు ఒక్కటే కారణమని ఆరోపించారు. ఆ కేసులో ఏమీలేకపోతే ఈపాటికి ఎప్పుడో క్లీన్‌చిట్ తీసుకునేవారు కదా అని వ్యాఖ్యానించారు. గోదావరికి ఏడాదిలో కచ్చితంగా మూడుసార్లు వరద వస్తుందని, దీనిద్వారా సముద్రంలోకెళ్లే నీటిలో పదో వంతు మనం నిల్వ చేసుకున్నా కృష్ణాడెల్టా సస్యశ్యామలం అవుతుందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కృష్ణానీటిలో మనకు లభించే 100 టిఎంసిలను పూర్తిగా రాయలసీమకే మళ్లించవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే దీనికి అంకురార్పణ చేసిన దివంగత వైఎస్‌కు ఎక్కడ మంచిపేరు వస్తుందోననే భయం బాబును వెంటాడుతోందన్నారు. వాస్తవానికి దీన్ని పూర్తిచేస్తే ప్రజలు బాబును కూడా గుర్తుంచుకుంటరన్నారు.
2020 నాటికి సహజ గ్రావిటీతోనే గోదావరి జలాలు తరలివస్తుంటే ఈలోపుగా నిరర్థక పురుషోత్తమపట్నం ప్రాజెక్టును వేల కోట్ల వ్యయంతో ఎందుకు చేపడుతున్నారో ఏమాత్రం అర్థం కావటం లేదన్నారు. పట్టిసీమ కోసం తవ్విన 30 కి.మీల కాలువకు ఎంత వ్యయం అయిందో ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలంటూ ఉండవల్లి సవాల్ విసిరారు. పట్టిసీమ వద్ద ఏర్పాటు చేసిన మొత్తం 23 పంపులు పూర్తిగా పనిచేసింది కేవలం మూడురోజులే అన్నారు. పోలవరం పనుల ఆలస్యానికి టిడిపికి చెందిన కాంట్రాక్టర్లు మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు, మాగంటి కోర్టుకెళ్లటం వల్లేనన్నది ఎవరికి తెలియదంటూ ఆయన నిప్పులు చెరిగారు. వీరి నిర్వాకం వల్ల ప్రాజెక్ట్ వ్యయం 10వేల 400 కోట్ల నుంచి 16వేల కోట్లకు చేరితే ప్రస్తుతం అదికాస్తా 40వేల కోట్లకు చేరిందన్నారు. 60ఏళ్లు దాటినందున యువతకు అవకాశాలివ్వడానికి ఎన్నికల్లో తాను పోటీ చేయదల్చుకోలేదని చెప్పారు. అలాగే ఏ పార్టీలోనూ చేరబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా ఉండవల్లి స్పష్టం చేశారు.