ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ స్కూళ్లలో ఐఐటి ఫౌండేషన్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 7: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మునిసిపల్ పాఠశాలలను ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలుగా మార్చునున్నట్లు రాష్ట్ర మునిసిపల్‌శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శనివారం నెల్లూరు నగరంలోని కస్తూరిదేవి గార్డెన్‌లో మునిసిపల్, ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన సమిక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునిసిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను జాతీయ స్థాయి పరీక్షలకు ఎంపిక అయ్యే విధంగా ఐఐటి ఫాండేషన్ కోచింగ్‌ను ఈ నెల 11 నుండి జూన్ 11వ తేదీ వరకు ఇవ్వనున్నట్లు చెప్పారు. జాతీయస్థాయి పరీక్షలలో మునిసిపల్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాంకులు సాధించే విధంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. తెలుగు మీడియం నుంచి ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియం మారడం వల్ల ఉపాధ్యాయులకు విద్యార్థులకు తొలి ఏడాది కష్టంగా ఉండవచ్చున్నారు.