ఆంధ్రప్రదేశ్‌

ఏసిబి వలలో పంచాయతీరాజ్ ఇఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 7: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పంచాయితీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న జి దుర్గాప్రసాదరావు ఇంటిపైనా, కార్యాలయంపైనా అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడిచేసి సోదా చేశారు. ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని వచ్చిన ఫిర్యాదుతో ఈ తనిఖీలు నిర్వహించారు. సుమారు కోటి రూపాయలు ఆస్తులున్నట్టు రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో జరిపిన సోదాలో బయటపడింది. విలువైన భూములు, ప్లాట్లు ఉన్నట్లుగా గుర్తించారు. విశాఖపట్టణంలో నాలుగుచోట్ల, రాజమహేంద్రవరంలో రెండు చోట్ల దాడులు చేశారు. ఏకకాలంలో ఎసిబి అధికారులు ఆయన కార్యాలయంతోపాటు బంధువుల ఇళ్లపైనా దాడులు నిర్వహించారు. రాజమహేంద్రవరంలో నాలుగు చోట్ల, విశాఖపట్నంలో ఒక చోట శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రాజమహేంద్రవరం, ఏలూరు, విశాఖపట్నం, విజయవాడఏసిబి అధికారులు ఈ సోదాల్లో భారీ ఎత్తున అక్రమాస్తులు బయటపడ్డాయి. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో రూ. లక్ష నగదు, బ్యాంకులో 5లక్షల నగదు నిల్వ, సుమారు అరకేజీ బంగారు ఆభరణాలు, ఆర్యాపురం, ఎస్‌బిఐ బ్యాంకుల్లోని లాకర్లలో 400 గ్రాముల బంగారం, అరకేజీ వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించామని డిఎస్పీ జి రామచంద్రరావు చెప్పారు. రాజమహేంద్రవరంలో 2 ప్లాట్లు, 2 అంతస్తుల భవనం, 6 ఇళ్ల స్థలాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సుమారు కోటి 15లక్షలకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించామని ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు తెలిపారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు 5నుంచి 6కోట్ల వరకు ఉంటుందని అంచనా.

చిత్రం ఇఇ దుర్గాప్రసాదరావు