ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక శోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 14: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకపరంగా అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో టూరిజం-కల్చర్, హెరిటేజ్ కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపాదించిన వివిధ పర్యాటక ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టి పూర్తిచేయడం ద్వారా రాష్ట్రాన్ని పర్యాటకంగా పెద్దఎత్తున అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అమరావతి రాజధానికే తలమానికంగా నిలిచేలా ఇబ్రహీంపట్నం వద్ద గల పవిత్ర సంగమం ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. అక్కడ సుమారు 250 కోట్ల రూపాయలతో 10వేల మందికి సరిపడా డివిజిబుల్ ఫ్లోట్ ఫ్లోర్ మల్టీపర్పస్ హాల్, గ్రాండ్ థియేటర్/ఆడిటోరియం, హోటల్ వంటి ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. విజయవాడ నగరానికి 16 కిమీల దూరంలో ఉన్న కొండపల్లి కోటను కల్చరల్ హెరిటేజ్ టూరిజం డెస్టినేషన్‌గా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడికి వచ్చే పర్యాటకులకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించేందుకు వీలుగా లైట్ అండ్ మ్యూజిక్ కార్యక్రమాలతో పాటు ఆడియో, వీడియో ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడ ఘంటసాల సంగీత కళాశాల ఆవరణలో సుమారు 10 కోట్ల రూపాయలతో 1000 మంది కూర్చునే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మరో కళాక్షేత్రాన్ని నిర్మించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో కూచిపూడి నాట్యాలయం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రస్తుతం వినియోగంలో లేని హేవలాక్ బ్రిడ్జిని సుమారు 116 కోట్ల వ్యయంతో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని సిఎస్ చెప్పారు. ముఖ్యంగా అక్కడ షాపింగ్ జోన్స్, ఫుడ్ అండ్ బేవరేజ్ జోన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్స్ వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో తొలుత రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా రాష్ట్రంలో చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులు, ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటర్ స్పోర్ట్స్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ లైసెన్సింగ్ అథారిటీగా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.