ఆంధ్రప్రదేశ్‌

‘పేషంట్ ఫస్ట్’ కావాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 14: ‘గత ఏడాదితో పోలిస్తే, ఈ సంవత్సరం ఆరోగ్య సూచికలో స్వల్ప స్థాయిలో వెనక్కు వెళ్లడానికి గల కారణాలు అనే్వషించాలి. వెంటనే తగిన చర్యలు తీసుకుని మళ్లీ పూర్వస్థితికంటే మెరుగ్గా ఆరోగ్య సూచికలో వృద్ధి సాధించాలి’ అని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అనేక రకాల కారణాలతో అనారోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయని, కారణం ఏదైనా, ఎంత వేగంగా స్పందించామనేది ముఖ్యమన్నారు. ప్రతి అధికారి విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. అప్పుడే ప్రజలకు న్యాయం చేయగలమని, అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను ఉపయోగించుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య శాలల్లో ప్రజల వైద్య రికార్డులను నిర్వహించాలన్నారు. అప్పుడు ముందస్తు వ్యాధి నిరోధక చర్యలు సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి వరకు జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ఆయన వైద్యశాఖ స్థితిగతులు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఐటిడిఎల్లో మరిన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల వైద్య పరీక్షలకు అవసరమైన లాబరెటరీలను రాష్ట్రంలో సిద్ధంగా ఉంచాలరన్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలన్నారు. అందుబాటులో ఉన్న వైద్యులను, సహాయ సిబ్బందిని సమర్థంగా వినియోగించుకోవాలని, ‘పేషంట్ ఫస్ట్’ అనే విధానాన్ని వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అలవర్చుకోవాలన్నారు. కేవలం సీజనల్‌గా వ్యాపించే ఒకటి, రెండు వ్యాధుల మీదే కాకుండా, సాధారణంగా వచ్చే 10 వ్యాధులను గుర్తించి నివారణకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.

చిత్రం.. వైద్యఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు