ఆంధ్రప్రదేశ్‌

వేరుశెనగ రక్షణకు 10 వేల రెయిన్‌గన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జూలై 14: అనంతపురం జిల్లాలో ఈ ఏడాది ముందస్తుగా ఖరీఫ్ వేరుశెనగ పంటకు రక్షక తడులిచ్చి కాపాడుతామని మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలో రెయిన్‌గన్ల వినియోగంపై నిర్వహించిన జిల్లా స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రులు మాట్లాడారు. గత ఏడాది అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో రెయిన్‌గన్ల ద్వారా వేరుశెనగ పంటకు రక్షక తడులిచ్చినా, ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభించడంతో అనుకున్న ఫలితాలు సాధించలేక పోయామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది జూలై నుంచే ప్రణాళికబద్ధంగా వేరుశెనగ పంట రక్షణకు తడులు ఇస్తామన్నారు. ఇందుకోసం 10 వేల రెయిన్‌గన్లు, 10 వేల స్ప్రింకర్లను మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.