ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడ పాదయాత్ర అప్రజాస్వామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 14: వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అధికారం కోసం అర్రులు చాస్తున్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళావెంకటరావు విమర్శించారు. ఎన్నికల ముందు మెనిఫెస్టో విడుదల చేసే ఆచారం ఉందని, అయితే రెండేళ్ళ ముందుగానే మేనిఫెస్టో విడుదల చేయడంలో పార్టీ విలువలు, ఉద్దేశ్యం ఏమిటని కళా ప్రశ్నించారు. పార్టీకిగాని, నాయకత్వానికి గాని విలువలు, పద్ధతలు ఏమైనా ఉన్నాయా అని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఆర్ అండ్ బి వసతి గృహంలో విలేఖరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ఏమీ లేకుండా మానిఫెస్టో విడుదల ఏమిటని అన్నారు. అధికార దాహం జగన్‌లో పెరిగిపోవడం వల్ల ఇటువంటి పరిణామాలకు దారులు తెరుస్తున్నారన్నారు. మడమ తిప్పడం ఉండదని జగన్ చెప్పే మాటల్లో వాస్తవికత గమనిస్తే - పరిపాలనలోకి రాగానే దశలవారీగా సారా నిషేధం చేస్తామని వైఎస్ చెప్పారని, కానీ, రూ. 10 వేల కోట్ల ఆదాయం కలిగిన మద్యం అమ్మకాలను రూ. 30 వేల కోట్ల ఆదాయం వచ్చేటట్లు చేసారని ఎద్దేవా చేసారు. ప్రజల కోసం పార్టీలు ఉండాలే తప్ప స్వలాభం కోసం పార్టీలు కాదని హెచ్చరించారు. వైకాపా స్వలాభం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదన్నారు. జూన్‌లో ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ అన్నారని, ఎందుకు వారితో రాజీనామా చేయించలేకపోయారని ప్రశ్నించారు. ముద్రగడ పాదయాత్రపై మాట్లాడుతూ కాపులను బిసి జాబితాలోకి చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన మాట మేరకు కట్టుబడి ఉన్నారని, కాపుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసామని కళా చెప్పారు.