ఆంధ్రప్రదేశ్‌

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: రెండు రోజుల పాటు జరిగే ఎపిపిఎస్సీ గ్రూప్-2 మెయిన్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని 171 కేంద్రాల్లో ఎంతో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్ష ప్రారంభించగా మొత్తం 49,106 మంది అభ్యర్థులకు గాను 45,287 మంది (92.22 శాతం) హాజరయ్యారు. మొత్తం 982 పోస్టుల భర్తీ కోసం ఈ పరీక్షలు జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో విశాఖలోని గీతం యూనివర్శిటీ, ప్రకాశం జిల్లా చీరాలలోని సెయిట్ ఆన్స్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో పరీక్షలకు కొంతసేపు తీవ్ర అంతరాయం కలిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవటం, కంప్యూటర్‌లలో సాంకేతిక లోపాలతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఉన్నతాధికారులు అభ్యర్థులకు పరీక్ష గదుల్లోనే రిఫ్రెష్‌మెంట్ ఇచ్చి లోపాలు సరిదిద్ది పరీక్ష నిర్వహించారు. పరీక్ష జరిగే సమయంలో అభ్యర్థులెవ్వరూ హాలు వెలుపల సంచరించకుండా ఇన్విజిలేటర్లు తగిన చర్యలు చేపట్టాలంటూ కమిషన్ కార్యదర్శి వైవిఎస్‌టి శాయి ఆదేశాలు జారీ చేశారు. రెండోరోజైన ఆదివారం ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈసందర్భంలో హాల్‌టికెట్, ఫొటో గుర్తింపు కార్డు మినహా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, క్యాలిక్యులేటర్లు, పెన్నులను అనుమతించడం లేదు.