ఆంధ్రప్రదేశ్‌

జగన్‌వి పగటి కలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: వచ్చే ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకుంటామని జగన్, ఆయన పార్టీ నేతలు కలలు కంటున్నారని, అవి చివరికి పగటి కలలుగా మిగిలిపోతాయని రాష్ట్ర పర్యావరణ, అడవులు, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. 2019లో తిరిగి తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుందని జగన్ సొంత సర్వేలే చెప్పడంతో ఏమిచేయాలో తెలియని స్థితిలో ప్రశాంత్‌కిశోర్‌ను తెచ్చి కొత్త డ్రామాకు తెర తీశారని శనివారం ఆయన ఇక్కడో ప్రకటనలో వ్యాఖ్యానించారు. నెలకు రూ.1000, రూ.1,500 పెన్షన్లు పొందుతున్న 46లక్షల మంది వృద్ధులు, వికలాంగులు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారనే సమాచారంతో జగన్ కంగుతిన్నారన్నారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప తెలంగాణలో వైకాపా ఉనికే లేదని, జగన్ వైసిపి జాతీయ అధ్యక్షుడుగా ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై జగన్‌కు గౌరవం లేదని, అధికారులంటే ఆయనకు చులకన భావనని విమర్శించారు. వైకాపా ప్లీనరీలో ప్రకటించిన 9 అంశాల్లో కొత్తదనమేమీ లేదన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బురద జల్లడం తప్ప, అలవికాని వాగ్దానాలు చేసిన జగన్ అభాసుపాలవుతాడని అన్నారు. జగన్‌కు ప్రతిదీ రాజకీయమేనని, వ్యక్తులు, వ్యవస్థల్ని తన రాజకీయ చదరంగంలో పావులుగా వాడుకుంటున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ పూర్తిగా విఫలమయ్యాడని, రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానిద్వారా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడన్నారు. ఆయన నాటకాలు ఎంతోకాలం కొనసాగవని మంత్రి శిద్దా హెచ్చరించారు. వైకాపాలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్నారు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని మంత్రి శిద్దా ధీమా వ్యక్తం చేశారు.