ఆంధ్రప్రదేశ్‌

ప్రతి నిర్మాణం.. ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 15: ప్రజా రాజధాని అమరావతిలో ప్రతి నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని రాష్ట్ర పులపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాజధానిలో చేపడుతున్న పలు ప్రాజెక్టులపై శనివారం మంత్రి కేదారేశ్వరపేటలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడిసి) ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ ప్రఖ్యాత స్థాయిలో రాజధానిని నిర్మించే విధంగా అధికారులు పని చేయాలని సూచించారు. ఏడిసి సిఎండి డి లక్ష్మీపార్థసారథి ఈ సందర్భంగా పలు డిజైన్లను మంత్రికి సమర్పించారు. ప్రధానంగా శాఖమూరు రీజనల్ పార్క్‌కు సంబంధించి హెచ్‌సిపి కన్సల్టెంట్ అందించిన డిజైన్లపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. పార్క్ నిర్మాణానికి టెండర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాజధానిలో నిర్మిస్తున్న ఏడు ప్రాధాన్య రహదార్లు, ప్రధాన అనుసంధాన రహదార్లపై చేపట్టనున్న పచ్చదన ప్రణాళికలను సిఎండి వివరించారు. రాజధాని పరిధిలో నిర్మించే అంతర్, బాహ్యవలయ రహదార్ల గురించి కూడా సమావేశంలో మంత్రి అధికారులతో చర్చించారు. ఏడిసి అధికారులు పి సురేష్‌బాబు, డాక్టర్ కెవి గణేష్‌బాబు, వై రమేష్‌బాబు, ఓబుల్‌రెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.