ఆంధ్రప్రదేశ్‌

అలిగిన మంత్రి అయ్యన్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 15: ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవ సభకు హాజరైన మంత్రి అయ్యన్నపాత్రుడికి చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆయన అలక వహించారు. రాజధాని అమరావతి సమీపంలో నీరుకొండ గ్రామం వద్ద శనివారం వర్శిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యారు. ఒకింత ఆలస్యంగా వచ్చిన మంత్రి అయ్యన్నను అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వేదికపైకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో ఆయన ఆగ్రహించి వెనుతిరిగారు. గుంటూరు జిల్లా అధికారులకు ఈ విషయం తెలిసి బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు.