ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనపై వచ్చేవారం చార్జిషీట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 15: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుని కేసులో దర్యాప్తు పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. వచ్చే వారం చార్జిషీట్ దాఖలు చేస్తామని వారు సిఎంకు తెలిపారు. ఈ నెల 26న ముద్రగడ పాదయాత్ర సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. డిఎస్పీల బదిలీలపై డిజిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడారు. త్వరగా జాబితా సిద్ధం చేయాలని ఈసందర్భంగా చంద్రబాబు ఆదేశించారు. ఈ సమావేశంలో ముద్రగడ పద్మనాభం ఈ నెల 26 నుంచి జరపతలపెట్టిన పాదయాత్ర, డిఎస్పీల బదిలీల అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. సమావేశంలో డిజిపి సాంబశివరావు, ఏజీ, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.