ఆంధ్రప్రదేశ్‌

కర్నూలు వైకాపాలో కలకలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 15: కర్నూలు జిల్లా వైకాపాలో ఎంపి బుట్టా రేణుక తీరు కలకలం రేపింది. కర్నూలు ఎంపి బుట్టా రేణుకమ్మ రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను కలవడం పార్టీలో మరో వివాదానికి దారి తీసింది. దీన్ని తీవ్రంగా పరిగణించిన పార్టీ అధినేత జగన్ రేణుకను మందరించినట్లు సమాచారం. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేశ్‌ను కర్నూలు నగరంలోని అతిధి గృహంలో ఎంపి బుట్టా రేణుకమ్మ కలిసి కొద్దిసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం మీడియాలో ప్రచారం కావడంతో వెంటనే స్పందించిన జగన్ రేణుకమ్మకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆమె కినుక వహించినట్లు సమాచారం. కోడుమూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడిపై పంచాయితీరాజ్ మంత్రికి వినతిపత్రం సమర్పించడానికి కలిసానే గానీ ఇందులో రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదని ఆమె మీడియాకు స్పష్టం చేశారు. రాజకీయంగా కలవాలనుకుంటే కర్నూలులో ఎలా కలుస్తానని కూడా ఆమె అన్నారు.లోకేశ్‌ను కలవడంపై తన వివరణ వినకుండా జగన్ మాట్లాడిన తీరుపై తన సన్నిహితుల వద్ద రేణుక అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఎంపిగా తాను చేసిన ప్రయత్నం సరైందేనని సమర్ధించుకున్నట్లు సమాచారం. శనివారం హైదరాబాదులో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఆమె హాజరుకాకుండా ఇంటికే పరిమితమైనట్లు తెలుస్తోంది. రేణుక గైర్హాజరుపై జగన్ మండిపడుతూ నిబంధనల ప్రకారం ఉంటేనే పార్టీలో కొనసాగాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటానని ఆగ్రహంతో అన్నట్లు ప్రచారం జరుగుతోంది.