ఆంధ్రప్రదేశ్‌

గ్రూప్-2 మెయిన్స్‌కి సాఫ్ట్‌వేర్ ఇబ్బందులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: విశాఖలోని ఒక ప్రైవేటు కళాశాలలో శనివారం జరగాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. కంప్యూటర్లలో పరీక్షలకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కాకపోవడంతో పరీక్షకు ఆటంకం ఏర్పడింది. దీంతో విద్యార్థులు పరీక్ష వాయిదా వేయాలంటూ నిరసనకు దిగారు. సంఘటనకు సంబంధించి అధికార వర్గాలు అందించిన సమాచారం మేరకు నగరంలో ఒక ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో 354 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కంప్యూటర్లను కళాశాల సమకూర్చగా, పరీక్షకు సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) సంస్థ బాధ్యత తీసుకుంది. అయితే పరీక్షా కేంద్రంలోని కొన్ని కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 181 మంది పరీక్ష రాయలేకపోయారు. దీంతో అభ్యర్థులు బయటకు వచ్చి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చిన సంస్థ ప్రతినిధులు హుటాహుటిన హాజరై, సమస్యను పరిష్కరించారు. అప్పటికే పరీక్షా సమయం గడచిపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2 మెయిన్స్ తొలి పరీక్షను రద్దుచేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే, దీనికి అధికారులు అంగీకరించలేదు. సాంకేతిక లోపం సరిదిద్దినందున పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. దీనికి విద్యార్థులు అంగీకరించకుండా ఆందోళన కొనసాగించారు. ఇదే కేంద్రంలో గ్రూప్-2 మెయిన్స్ పార్ట్-2 పరీక్ష జరగనుంది.