ఆంధ్రప్రదేశ్‌

సిఇజిసి సభ్యురాలిగా స్వాతిరాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 15: కేంద్ర ఉపాధి హామీ మండలి (సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ కౌన్సిల్) సలహా సభ్యురాలిగా ఇక్కడి జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి నియమితులయ్యారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్‌లో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో జెడ్పీ చైర్మన్ల విభాగంలో దేశంలో ఈమె ఒక్కరికే ఈ అవకాశం దక్కింది. ఈ సలహా సంఘం సభ్యురాలిగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం ఎలా అమలవుతుంది, లోటుపాట్లు, పథకం పకడ్బందీగా అమలు చేయడానికి కేంద్రానికి సలహాలు, సూచనలు అందజేస్తారు. ఉపాధి హామీ చట్టం అమలు తీరు, అందులో భాగంగా ఉన్న ప్రతి పథకాన్ని కౌన్సిల్ సమీక్షిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరు, వేతనదారుల పరిస్థితులు, స్థితిగతులపై అధ్యయం చేస్తారు. పథకం అమల్లో ప్రజలు కోరుకుంటున్న మార్పులు, చేర్పులను కూడా పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తారు. ఈ సందర్భంగా స్వాతిరాణి శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ తనకు కట్టబెట్టిన ఈ పదవికి వనె్న తెచ్చే విధంగా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. వచ్చే ఏడాది జూన్ వరకు సభ్యత్వం ఉంటుందని, తొలి కౌన్సిల్ సమావేశం ఈ నెల 25న ఢిల్లీలో జరగనుందని ఆమె తెలిపారు.