ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులకు చిక్కిన భారీ తిమింగలం కళేబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 15: కృష్ణా జిల్లా బందరు సముద్ర తీరానికి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరంలో చనిపోయిన ఓ భారీ తిమింగలం గిలకలదిండి మత్స్యకారుల వలకు చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన కొందరు గిలకలదిండి మత్స్యకారులు నెల్లూరు సరిహద్దుల్లో వేటాడుతుండగా మూడురోజుల క్రితం సముద్రంలో తేలుతున్న ఓ భారీ తిమింగలం కంటపడింది. వెంటనే దాన్ని వలలు, తాళ్ల సాయంతో శుక్రవారం ఉదయం గిలకలదిండి సముద్ర ముఖద్వారానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తీరానికి తీసుకొచ్చారు. తిమింగలంలో ఉండే అత్యంత ఖరీదైన అంబర్ (పిట్టపియ్య) కోసం వెతుకులాడారు. అయితే అప్పటికే ఖరీదైన అంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సముద్రంలోనే తీసివేసినట్లు గుర్తించారు. దీంతో ఎంతో ఆశతో చనిపోయిన తిమింగలాన్ని వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు తీసుకొచ్చిన మత్స్యకారులు నిరాశకు గురయ్యారు. గిలకలదిండికి చెందిన మూడు బోట్లలోని మత్స్యకారులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన మరో నాలుగైదు బోట్ల మత్స్యకారు లు ఈ భారీ తిమింగలం కళేబరాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మెరైన్ సిఐ గోవిందరాజు, మత్స్య శాఖాధికారులు తిమింగలం కళేబరాన్ని పరిశీలించారు. 20రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు.
సుమారు 20 టన్నుల బరువు ఉం టుందని ఎఫ్‌డివో రాజ్‌కుమార్ తెలిపారు. తీవ్రమైన దుర్వాసన రావటంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించలేదు.

చిత్రం.. మత్స్యకారులు లాక్కొచ్చిన భారీ తిమింగలం కళేబరం