ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ ప్రాజెక్టులకు సకాలంలో మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో పద్మభూషణ్ డాక్టర్ కెఎల్ రావు పాత్ర ఎంతో ఉందని అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ కెఎల్ రావు 115వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ కొద్దిమంది చరిత్ర సృష్టించడానికే వస్తారని, అలాంటి కొద్దిమందిలో కెఎల్ రావు ఒకరని, చరిత్ర ఉన్నంతవరకు ఇలాంటి వారిని మరచిపోలేమని అన్నారు. నేడు కృష్ణానదిలో నీటి సమస్య ఉందని, గోదావరి నది అటవీ ప్రాంతం గుండా పయనించడం వల్ల అడవిలో కురిసిన వర్షాలు నదిలోకి వస్తున్నాయని, ఆ నీరు వృథాగా సముద్రంలోకి పోతోందన్నారు. అలా సముద్రంలోకి వృథాగా వెళ్లే నీరు 100 నుంచి 200 టిఎంసిల వరకు ఉంటుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణాడెల్టాని ఆదుకోవడానికి పవిత్ర సంగమం వద్ద గోదావరి నీటిని కృష్ణానదిలోకి కలిపామన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఒక మహాసంకల్పం తీసుకుని గోదారమ్మ తల్లి ఆశీర్వాదంతో కృష్ణాకి గోదావరి నీటిని సంవత్సర కాలంలో తీసుకురాగలిగామని, కెఎల్ రావు స్ఫూర్తితో రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చంద్రబాబు వివరించారు. కెఎల్ రావు కృషి వల్ల నాగార్జునసాగర్ లెఫ్ట్, రైట్ కెనాల్ పూర్తయ్యాయన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు బచావత్ అవార్డును స్టడీ చేసి మరో అవార్డు వచ్చేవరకు పూర్తిగా నీటిని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నారన్నారు. రాయలసీమకు నీటిని అందించడానికి శివరామకృష్ణయ్య లాంటి ఇంజనీర్లు విశేషంగా కృషి చేశారన్నారు. చివరి భూముల వరకు నీళ్లిచ్చే పనిని ముఖ్యమంత్రిగా తానే స్వీకరించి ప్రాజెక్టు పూర్తిచేస్తున్నామని ఆయన వివరించారు. కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు బుద్దా వెంకన్న, బచ్చుల అర్జునుడు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, జలవనరుల శాఖ ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు చెరకూరి వీరయ్య, ఇఎన్‌సిలు వెంకటేశ్వరరావు, రవికుమార్, ఎపెక్స్ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, గుత్తా శివరామకృష్ణ, పుల్లయ్య చౌదరి, రైతులు పాల్గొన్నారు.

చిత్రం.. కెఎల్ రావు జయంతి సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు