ఆంధ్రప్రదేశ్‌

సైన్స్ వైపు మొగ్గుచూపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, జూలై 15: ప్రస్తుతం సమాజంలో యువత ఇంజనీరింగ్ ఎంబిబిఎస్, వాటితోపాటు సైన్స్‌పట్ల మొగ్గుచూపితే మంచి భవిష్యత్ ఉంటుందని, దేశానికి సేవ చేయవచ్చని ఇస్త్రో చైర్మన్ డాక్టర్ ఎ.ఎన్ కిరణ్‌కుమార్ అన్నారు. శనివారం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో 6వ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్ ప్రపంచ దేశాల్లో విద్యార్థులు సైన్స్‌పట్ల మొగ్గుచూపుతూ ఆ దేశానికి విశిష్ట సేవలు అందిస్తున్నారని, అలాగే మన దేశంలో యువత ఇంజనీరింగ్, ఎంబిబిఎస్‌తో పాటు సైన్స్‌పట్ల కూడా మొగ్గుచూపితే బాగుంటుందని అన్నారు. అనంతరం బిటెక్, ఎంటెక్, ఎంసిఎ కోర్సులు పూర్తిచేసుకున్నటువంటి విద్యార్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఎం.మోహన్‌బాబు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు.