ఆంధ్రప్రదేశ్‌

పేకాడుతూ పట్టుబడ్డ పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరురూరల్, జూలై 15: సమాజాన్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికి సహకరించవలసిన పోలీసులే అసాంఘిక కార్యక్రమాల్లో భాగస్వాములుగా నిలుస్తూ జైలుకు వెళ్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో ఎదురైంది. నెల్లూరు శివారు ఇరుకళలమ్మ సంఘం సమీపాన రాజీవ్ గృహ సముదాయంలో శుక్రవారం అర్ధరాత్రి పేకాట జోరుగా సాగుతోందని సమాచారం అందుకున్న రూర ల్ పోలీసులు పేకాట స్థావరంపై దాడిచేశారు. ఆ సందర్భంలో ఆరుగురు జూదరులను అదుపులోకి తీసుకోగా వారిలో ముగ్గురు పోలీస్ కానిస్టేబుళ్లు కావడం విశేషం. ఈముగ్గురులో ఇద్దరు ఎఆర్ కానిస్టేబుళ్లు కాగా మరొకరు తడ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ ఆరుగురిని అదుపులోకి తీసుకున్న సమయంలో వీరి వద్ద 2.29 లక్షల రూపాయల నగదును గుర్తించి స్వాధీ నం చేసుకున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ తెలిపారు. తడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ రవి, ఎ ఆర్ కానిస్టేబుల్ పవన్‌కుమార్, మహేష్, వీరితో పాటు మరో ముగ్గురిని శనివారం అరెస్టు చేసి కోర్టుకు హాజరు పర్చారు.