ఆంధ్రప్రదేశ్‌

లైంగిక వేధింపుల నుంచి బాలల్ని రక్షిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 15: లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలుగురాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ అన్నారు. బాలలపై లైంగిక వేధింపులు, రక్షణ చట్టాలు అమలుపై నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన రాష్టస్థ్రాయి సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కీలకోపన్యాసం చేశారు. బాలల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా ఫలితాలు సాధించవచ్చన్నారు. ముఖ్యంగా యువత అటువైపు వెళ్ళకుండా కుటుంబపరంగా వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాలలు దేశానికి సంపదని వారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. బాలలు నేర ప్రవృత్తి వైపు దృష్టి వెళ్లకుండా చూడాలన్నారు. లైంగిక వేధింపులు రక్షణ చట్టం 2012ను ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు. చిన్నారులపై లైంగిక వేధింపులు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. నేర మార్గాన వెళ్తున్న బాలలను సంస్కరించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. బాలల కేసుల విచారణ సమయంలో ఏజెన్సీలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మాట్లాడుతూ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఎఫెన్‌సెస్ చట్టం 2012 (పోక్సో-2012) చట్టం 18ఏళ్ళ లోపు వారికి వర్తిస్తుందన్నారు. గణంకాల ప్రకారం 53శాతం మంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, 46 శాతం మంది కిడ్నాప్‌లకు గురవుతున్నారని అన్నారు. 213మంది బాధితులకు లీగల్ ఎయిడ్ అందిందన్నారు. జువైనల్ జస్టీస్ చట్ట పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టిందన్నారు.
రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ రాష్ట్ర పోలీసుశాఖ తరుఫున బాలల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం నమోదవుతున్న బాలల మిస్సింగ్ కేసులపై పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరిస్తుందన్నారు. సదస్సులో జస్టీస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టీస్ ఎంఎస్‌కె జయస్వాల్, జిల్లా జడ్జి వై లక్ష్మణరావు, యునిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్టు సోని జార్జి, నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్, పోలీసు అధికారులు, న్యాయాధిపతులు పాల్గొన్నారు.

చిత్రం.. సదస్సులో ప్రసంగిస్తున్న జస్టిస్ రమేష్ రంగరాథన్