ఆంధ్రప్రదేశ్‌

లక్ష మంది ఐటిఐ విద్యార్థులకు ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: రాష్ట్రంలో ఐటిఐ చదివిన లక్ష మందికి శిక్షణను అందించి ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా స్థానిక ఎన్‌టిఆర్ యూనివర్సిటీ సమీపంలోని పరిణయ ఫంక్షన్ హాలులో కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద యువతకు ఉపాధి కల్పించాలనే ల క్ష్యంతో కార్మిక ఉపాధి శిక్షణా శాఖ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణను అందించి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ తరహా పరిశ్రమల్లో ఐటిఐ విద్యను అభ్యసించిన విద్యార్థులకు శిక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిక్షణ సమయంలో ఐటిఐ విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి 1500 రూపాయలను స్ట్ఫైండ్‌గా అందజేయడం జరిగిందన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు ఐటిఐ విద్యార్థులకు శిక్షణను అందించడంలో నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే స్ట్ఫైండ్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వం మరో 1000 రూపాయలను స్ట్ఫైండ్‌గా అందించాలని ఆలోచనలో ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకుని ఉపాధి వైపు పయనించాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ పరిశ్రమల యాజమాన్యాలకు స్ట్ఫైండ్ కింద ప్రభుత్వం నుండి 70 లక్షల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఉపాధి, శిక్షణా శాఖ కమిషనర్ డి.వరప్రసాదరావు, జాయింట్ డైరక్టర్ ఎస్.సత్యనారాయణ, సిఐఐ అధ్యక్షుడు డి.రామకృష్ణ, ఎపిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఎ.వెంకటేశ్వరరావు, ఎఫ్‌ఎపిసిఐఐఎ అధ్యక్షుడు సుబ్బారావు, పిబిటిసి ప్రధాన అధికారి కె.శ్రీనివాసకుమార్, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు.

చిత్రం.. సభలో మాట్లాడుతున్న మంత్రి పితాని