ఆంధ్రప్రదేశ్‌

పోలవరం స్పిల్‌వేకు బీటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 15: పోలవరం స్పిల్ వే కాంక్రీటు బీటలు వారిందని, నాణ్యతా లోపమే ఇందుకు కారణమని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే సెకన్లలో కోట్ల క్యూసెక్కుల జలాలు ఈ ప్రాంతాన్ని ముంచేస్తాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం స్పిల్ వే పనులను ఇటీవలే ముఖ్యమంత్రి ప్రారంభించారని, అయితే ఇందులో కంకర సైజు కూడా సక్రమంగా లేకపోవడం, నాసిరకంగా వుండటం వల్ల కాంక్రీటు బీటలు వారిందని తెలుస్తోందన్నారు. ఇది అసెంబ్లీ మాదిరిగా తాత్కాలిక నిర్మాణం కాదని, కీలకమైన ఈ స్పిల్‌వేలో నాణ్యత లేకపోతే చాలా ప్రమాదమని ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నామన్నారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని వినియోగిస్తున్నామని, ముఖ్యమంత్రి చెప్పే మాటలకు ఈ బీటలు చూస్తుంటే పొంతనలేకుండా ఉందని ఆరోపించారు. అదే విధంగా ముఖ్యమంత్రి జూన్ 8వ తేదీన శంకుస్థాపన చేసిన కాఫర్ డ్యామ్ నిర్మాణంలో కూడా విదేశీ యంత్రాలను ఏర్పాటు చేసిన చోట పునాదిలో ఇసుక తొలగించి మట్టి తగిలిన నుంచి నిర్మాణం చేపట్టాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్టు సమాచారం ఉందన్నారు. బీటలు వారిన స్పిల్ వే దృశ్యాలను ఉండవల్లి మీడియాకు విడుదల చేశారు. సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 18వ తేదీ చర్చకు వచ్చేటపుడు పట్టిసీమతోపాటు పోలవరం సమాచారంతో కూడా రాగలరని ఆశిస్తున్నానన్నారు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా లేదన్నట్టుగా, ఇంత కాలం అసలు కృష్ణా అంతా ఎడారేనన్నట్టు, పట్టిసీమ వల్లే సస్యశ్యామలమవుతున్నట్టుగా అధికార పార్టీ అనుకూలమైన మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఉండవల్లి ఆరోపించారు. కృష్ణా బ్యారేజీ నిర్మించిన 1855 నుంచి కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అత్యధిక దిగుబడులు తీయడంలో ముందంజలోనే ఉన్నారన్నారు. కేవలం పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టా అంతా బాగుపడినట్టు విస్తృత ప్రచారం చేస్తున్నారన్నారు. తాను వేసే ప్రశ్నలు ఊహాజనితం కాదని, కాగ్ తప్పు పట్టిన అంశాలు, సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సాక్షాధారాలను బట్టే అడుగుతానని ఉండవల్లి క్వశ్చన్ పేపర్ వెల్లడించారు. కేవలం మూడు ప్రశ్నలు మాత్రమే అడుగుతానన్నారు. పట్టిసీమ చంద్రబాబునాయుడు భగీరధ ప్రయత్నమే అయితే అబద్దపు జీవోతో ఎందుకు పట్టిసీమను మొదలెట్టారని ప్రశ్నించారు. పట్టిసీమ జీవోలు డొమెస్టిక్, ఇండస్ట్రీ అవసరాలకు మాత్రమే అని వుందని, అందుకు విరుద్ధంగా కృష్ణాకు ఎలా తరలిస్తున్నారని ప్రశ్నించారు. పట్టిసీమ కట్టేసిన తర్వాత సి డబ్ల్యుసి అనుమతి తీసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లపాటు తాత్కాలిక ప్రాజెక్టుగా పేర్కొని 20 ఏళ్ల డిపిఆర్ ఎందుకు తయారు చేశారని ఉండవల్లి ప్రశ్నించారు. నాబార్డు, కేంద్ర ప్రభుత్వం మధ్య రుణ మంజూరు ఒప్పందాన్ని ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నాబార్డు రూ.2981 కోట్లు రుణం ఇస్తూ ఇప్పటి వరకు రూ.1981 కోట్లు ఇచ్చిందని, మిగిలిన రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం నుంచి వివరణ ఇస్తూ రూ.950 కోట్లు ఇప్పటి వరకు ఇచ్చినట్టు సంబంధిత మంత్రి ప్రకటించారని, మొత్తం రూ.2900 కోట్లు ఇచ్చినట్టు తెలిపారన్నారు. ఈ నిధులన్నీ పోలవరం హెడ్ కిందే ఇస్తూ జీవో జారీ చేశారన్నారు. అయితే పురుషోత్తపట్నం, పట్టిసీమకు కూడా ఈ నిధులనే ఖర్చు చేశారని ఆరోపించారు. పోలవరం కోసం ఇచ్చిన నిధులను ఈ రెండు పథకాలకు ఖర్చు చేయడాన్ని బట్టి చూస్తుంటే ప్రభుత్వానికి పోలవరం పూర్తిచేసే ఉద్ధేశ్యం లేదనే అనుమానం కలుగుతుందన్నారు. పోలవరం అనుమానాలను కూడా గోరంట్ల ఈ చర్చలో నివృత్తి చేయాల్సి వుందన్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన భాద్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైఎస్ జలయజ్ఞంపై సాక్షాలు చూపిస్తే పిండారీల సంగతి తేలితుందని ఉండవల్లి అన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ అల్లు బాబి తదితరులు ఉన్నారు.