ఆంధ్రప్రదేశ్‌

ఇ-లెర్నింగ్ గేమింగ్ హబ్‌గా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 15: ఇ-గేమింగ్ విధానాల ద్వారా చిన్నారులకు సులభంగా విద్యను బోధించేలా వినూత్న పద్ధతులను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. దీనిపై యునెస్కో, తదితర సంస్థల సహకారం తీసుకోవాలని విద్యాశాఖను ఆదేశించారు. రాష్ట్రాన్ని ఇ-లెర్నింగ్ గేమింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని, యునెస్కో సహకారం అందించడానికి ముందుకు రావడం శుభసూచకమని అన్నారు. శనివారం మధ్యాహ్నం యునెస్కో ఎంజిఐఈపి ప్రతినిధులు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ ఏడాది డిసెంబర్ 16 నుంచి 18 వరకు మూడురోజులు విశాఖలో నిర్వహించనున్న ‘ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్ ఫర్ హ్యుమానిటీ (టెక్-2017)’ సదస్సుపై ఈ సమావేశంలో వారు ముఖ్యమంత్రికి వివరాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి యునెస్కోకు అనుబంధంగా ఉన్న మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐజిపి) ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యం 4.7’ సాధన కోసం విద్యా సాంకేతికత, డిజిటల్ పద్ధతుల ద్వారా శాంతియుత, సుస్థిర సమాజ స్థాపన ధ్యేయంగా టెక్-2017 జరగనుంది. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి విద్య, సమాచార సాంకేతిక, యువజన శాఖలకు చెందిన మంత్రులు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు, విద్యా సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, ఎడ్యుకేషన్ సైకాలజిస్టులు, పరిశోధకులు, న్యూరో సైంటిస్టులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మైక్రోసాఫ్ట్ సిఈవో సత్య నాదెళ్ల సదస్సులో ప్రసంగిస్తారని చెప్పారు. విద్యారంగంలో తేవాల్సిన మార్పులపై విస్తృతంగా చర్చలు జరుగనున్నాయని తెలిపారు. టెక్-2017 కేంద్ర మానవ వనరుల శాఖ కూడా సహకారం అందిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన వారిలో యునెస్కో ఎంజిఐఈపి ప్రతినిధి అనంత దురైయప్ప, ముఖ్యమంత్రి కార్యదర్శి గిరిజాశంకర్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఉన్నారు.
ప్రతిష్ఠాత్మకంగా ఐఈఏ ఉత్సవాలు
ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ (ఐఈఏ) శతాబ్ది ఉత్సవాలు అమరావతిలో ఘనంగా జరపడానికి ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ఏడాది డిసెంబర్ 27 నుంచి 30 వరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగే ఐఈఏ నూరవ సదస్సును గత ఏడాది తిరుపతిలో నిర్వహించిన సైన్స్ కాంగ్రెస్ తరహాలో ప్రతిష్ఠాత్మకంగా జరపాలని నిర్ణయించారు. వైజ్ఞానిక ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు ఏపీని నెలవుగా మార్చేందుకు కొత్త తరహా విద్యాకోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని, ఆమేరకు సదస్సులో మేధోమథనం సాగాలని సూచించారు.

చిత్రం.. యునెస్కో ఎంజిఇఐపి ప్రతినిధులతో సిఎం భేటీ