ఆంధ్రప్రదేశ్‌

సారూ.. మా ఫిర్యాదులు తీసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 15: విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పరిధిని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జిఓలో కేవలం మధురవాడ, కొమ్మాది ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్ అంశాలపై మాత్రమే విచారణ చేస్తుందని పేర్కొన్నారు. సిట్ విచారణ ప్రారంభమయ్యే నాటికి జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ భూముల రికార్డుల ట్యాంపరింగ్ జరిగినా విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిస్తామని సిట్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ ప్రకటించారు. తాజాగా శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో సిట్ విచారణ పరిధిలో మరికొన్ని అంశాలను జతచేర్చారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా రెవెన్యూ రికార్డులు మార్చడం, వెబ్‌ల్యాండ్‌లో వాటిని నమోదు చేయడం, మాజీ సైనికోద్యోగులు, రాజకీయ బాధితులకు కేటాయించిన భూములకు సంబంధించి ఎన్‌ఓసిలు జారీ చేయడం ద్వారా వాటి క్రయ, విక్రయాలకు అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు, ప్రభుత్వ భూముల దురాక్రమణ, ప్రభుత్వ భూముల్లో అనుమతుల్లేకుండా అనధికారికంగా నిర్మాణాలు చేపట్టిన సంఘటనలపై విచారణ చేపడుతుంది. ఇప్పటికే సిట్ ఎదుట రాష్ట్ర మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరై తనవద్దనున్న ఆధారాలను అందజేశారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లు కూడా బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాలు తీసుకున్న సంఘటనలకు సంబంధించి ఆధారాలు, కథనాలను అందజేశారు. దీనిపై సిట్ దృష్టి సారించింది కూడా. అలాగే పెదగంట్యాడ మండలం నడుపూరులో 260 ఎకరాల్లో మెడ్‌టెక్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా, ప్రభుత్వ భూములను కేటాయించింది. పూర్తిగా ప్రభుత్వ భూములైనప్పటికీ అనుభవదారులు ఉన్నారంటూ కొంతమంది అనర్హులు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందారు. దీనికి కొంతమంది రెవెన్యూ అధికారులు సహకరించినట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి అయ్యన్న రెండుసార్లు కలెక్టర్‌కు లేఖ రాయగా సమాధానం రాలేదు. దీనిపై కూడా మంత్రి సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఇక జిల్లాలో రాజకీయ నాయకుల అండ, అధికారుల సహకారంతో రికార్డులు తారుమారు చేసినట్టు సిట్‌కు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇదిలా ఉండగా జిల్లాలో భూ రికార్డుల ట్యాంపరింగ్, ఆక్రమణలకు సంబంధించి ‘సిట్’కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు శనివారంతో గడువు ముగిసింది. సిట్ ఫిర్యాదులు స్వీకరించడం మొదలుపెట్టినప్పటి నుంచి శుక్రవారం రాత్రి వరకూ 1,596 ఫిర్యాదులు అందాయి. కలెక్టరేట్‌లోని సిట్ ఫిర్యాదుల స్వీకరణ శనివారం ఉదయం నుంచి వందల సంఖ్యలో ఫిర్యాది దారులు బారులు తీరారు. గడువు ముగిస్తుందన్న ఆందోనతో తరలివఛ్చారు. శనివారం రాత్రి వరకూ ఫిర్యాదులు స్వీకరిస్తామని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. అయితే సిట్‌కు ఫిర్యాదు చేసేందుకు గడువు పెంచే అంశం తన పరిధిలోది కాదని ఆయన వెల్లడించారు.

చిత్రం.. సిట్‌కు ఫిర్యాదులు ఇచ్చేందుకు క్యూలైన్లలో నిల్చున్న బాధితులు