ఆంధ్రప్రదేశ్‌

గ్రూప్-2 పరీక్షల్లో మొరాయించిన కంప్యూటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి/ విజయవాడ, జూలై 16: ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం జరిగిన గ్రూప్-2 పరీక్షల్లో 7వ నెంబర్ సెంటర్‌లో అరగంట పాటు కంప్యూటర్లు పనిచేయలేదు. దీంతో అరగంట పరీక్ష సమయం పెంచారు. తిరుపతి, రేణిగుంటలో రెండోరోజు గ్రూప్-2 పరీక్షలు ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తిరుపతిలోని జూపార్క్ సమీపంలో వున్న ఐయాన్ డిజిటల్ జోన్ ఎడ్జ్ సెంటర్‌లో ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరిగాయి. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉంది. 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా సర్వర్లు మొరాయించాయి. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు పరీక్షలు ప్రారంభం కావడంతో సాయంత్రం 5.30 గంటల వరకు సమయం పొడిగించారు. కాగా, హైదరాబాద్ సహా మొత్తం 171 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.
మొత్తం 49వేల 106 మంది అభ్యర్థులకు గాను మొదటి పరీక్షకు 45వేల 288 మంది (92.22 శాతం), రెండో పరీక్షకు 45వేల 152 మంది (91.94 శాతం), మూడో పరీక్షకు 45వేల 157 మంది (91.95 శాతం) హాజరయ్యారు. ఆన్‌లైన్ పద్ధతిలో ఒకేసారి 50వేల మంది అభ్యర్థులకు విజయవంతంగా పరీక్షలు నిర్వహించామని బోర్డు కార్యదర్శి వైవిఎస్‌టి శాయి ఒక ప్రకటనలో తెలిపారు. రెండ్రోజుల్లో వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ వెల్లడిస్తామని, దీనిపై ఈ నెల 23లోపు తగిన ఆధారాలతో సహా అభ్యంతరాలు తెలియజేయాల్సి ఉందని ఆయన తెలిపారు.