ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక లోపంపై కమిటీదే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: విశాఖలో గ్రూప్-2 మెయిన్స్ తొలిరోజు పరీక్ష సందర్భంగా ఏర్పడిన సాంకేతిక లోపం వల్ల పరీక్ష రాయలేకపోయిన వారి విషయమై ఎపిపిఎస్సీ కమిటీ విచారించి, తుది నిర్ణయం తీసుకుంటుందని చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. విశాఖ, చిలకలూరిపేట ప్రాంతాల్లో మెయిన్స్ పేపర్ 1 పరీక్ష సందర్భంగా కంప్యూటర్లలో సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల వల్ల పరీక్షకు అంతరాయం ఏర్పడిందన్నారు. అయితే, చిలకలూరిపేట పరీక్షా కేంద్రంలో కంప్యూటర్ లోపాన్ని సరిచేసి, పరీక్ష నిర్వహించామన్నారు. విశాఖలో చోటుచేసుకున్న సంఘటనలో అభ్యర్థులు లోపాన్ని సరిదిద్ది పరీక్ష నిర్వహించే సమయంలోనే బహిష్కరించారని పేర్కొన్నారు. తిరిగి వీరికి పరీక్ష నిర్వహించే అంశంపై నిబంధనల మేరకు ఎపిపిఎస్సీ సభ్యులు సమావేశమై చర్చించిన అనంతర నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎపిపిఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షా ఫలితాలను నెల రోజుల్లోగా విడుదల చేస్తామని చైర్మన్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. విశాఖలో మెయిన్స్ పరీక్షా కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రిలిమ్స్ నుంచి 49 వేల మంది మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. వీరికోసం మెయిన్స్ పరీక్షల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా 173 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు. పరీక్షలకు సంబంధించి తొలి కీని ఆదివారం విడుదల చేస్తామని, దీనిపై అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం వారం తరువాత రెండో కీ విడుదల చేస్తామని చెప్పారు. రెండో కీ విడుదల చేసిన అనంతరం మూడు రోజుల గడువు తరువాత తుది కీ విడుదల చేస్తామన్నారు.