ఆంధ్రప్రదేశ్‌

‘రాజు’గారి శపథం అటకెక్కిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: ‘సరిగ్గా పదిహేనురోజుల్లో నేను ఒక కుంభకోణం బయటపెట్టబోతున్నా. మీ విజయవాడలో జరిగిన అతిపెద్ద భూకుంభకోణం కూడా బయటపెడతా!’- ఇది భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు గత జూన్ 20న విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చేసిన భీషణ ప్రకటన. రాష్ట్రంలో జరుగుతున్న, ప్రధానంగా విశాఖ కేంద్రంగా జరిగిన భూకుంభకోణంపై మీడియా ముందుకొచ్చి సంచలనం సృష్టించిన విశాఖ బిజెపి ఎమ్మెల్యే, శాసనసభలో ఆ పార్టీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఇటీవలి కాలంలో తరచూ చేస్తున్న ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి. భూకుంభకోణాలు, ఉద్యోగుల అవినీతిపైనే ఆయన ఎక్కువగా గళం విప్పుతున్నారు. విశాఖలో జరిగే అవినీతిని బయటపెట్టి, ఏసిబికి పట్టించేవారికి తానే 10వేల రూపాయల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించడమే కాకుండా చేసి చూపించారు. విష్ణుకుమార్‌రాజు వ్యవహార శైలి అటు ప్రభుత్వానికీ ఇబ్బందిగానే మారింది. మిత్రపక్షమైనప్పటికీ ప్రభుత్వంలో జరిగే అవినీతిని బహిర్గతం చేయడమే అందుక్కారణం. విశాఖలో జరిగిన అవినీతిపై తాను పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేస్తానని ఒక దశలో ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత నెలలో విజయవాడలో ఆయనే స్వయంగా మీడియాకు సమాచారమిచ్చి పార్టీ కార్యాలయంలో కాకుండా, హోటల్ ఐలాపురంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. పదిహేను రోజుల్లో తాను ఓ భూకుంభకోణం బయటపెట్టబోతున్నానని, విశాఖతో పాటు విజయవాడలో కూడా జరిగిన అతిపెద్ద భూకుంభకోణాన్ని వెల్లడిస్తానని విష్ణుకుమార్‌రాజు చేసిన ప్రకటన అందరిలోనూ ఉత్కంఠ రేపింది. ప్రధానంగా ప్రభుత్వంలో కలవరం పుట్టించింది. విజయవాడలో భూకుంభకోణం ఎక్కడ జరిగిందనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో మొదలయింది. సహజంగా విశాఖ భూకుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చి అవినీతిపై తరచూ మాట్లాడుతుండటంతో ఆయన ప్రకటన ఆసక్తి రేపింది. అయితే విష్ణు కొత్తగా తెరపైకి తెచ్చిన విజయవాడ భూకుంభకోణం ఏమిటన్నదే సస్పెన్స్‌గా మారింది. కానీ ఆయన ప్రకటన చేసి నెల కావస్తున్నా మళ్లీ ఇంతవరకూ దానిపై పెదవి విప్పకపోవడం అన్నివర్గాల్లో చర్చనీయాంశమయింది. సహజంగా ఇలాంటి వ్యవహారాల్లో రాజకీయ ప్రముఖులు తాము చెప్పిన ప్రకటనకు కట్టుబడి ఉంటారు. తాజాగా సాగునీటి ప్రాజెక్టుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టేందుకు రంగంలోకి దిగిన టిడిపి సీనియర్ ఎమ్మె ల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి సవాలును స్వీకరించి తాను విజయవాడ వస్తానని ప్రకటిస్తే, దాన్ని ఉండవల్లి కూడా స్వాగతించి ఆయనను అభినందించారు. కానీ విష్ణుకుమార్‌రాజు వ్యవహార శైలి అందుకు భిన్నం గా, తానే చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండకపోవడం సహజంగానే అనేక అనుమానాలకు తెరలేపింది. ఈ వ్యవహారంలో ఆయనపై పార్టీ స్థాయిలో ఏమైనా ఒత్తిళ్లు పనిచేసి ఉంటాయా? లేక ప్రభుత్వం నుంచి రాయబారం ఏమైనా నడిచిందా? ఇవేమీ లేనప్పుడు తాను చేసిన ప్రకటనకు విష్ణుకుమార్‌రాజు ఎందుకు కట్టుబడి ఉండలేదు? పోనీ పార్టీ నుంచి ఏమైనా ఒత్తిళ్లు వచ్చినా ఎంపిక చేసుకున్న మీడియాకు లీకులిచ్చి తన లక్ష్యం ఎందుకు నెరవేర్చుకోలేకపోయారు? పోనీ విశాఖ భూకుంభకోణంతో సంబంధం లేని విజయవాడ భూకుంభకోణమైనా ఎందుకు బయటపెట్టడం లేదు? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
సిట్‌కే ఇస్తా:విష్ణు
ఈ వ్యవహారంపై బిజెపిఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజును వివరణ కోరగా.. ఆ వివరాలను తాను సిట్‌కే అందిస్తానని చెప్పారు. ‘గతంలో మీరు పదిహేను రోజుల్లో భూకుంభకోణం బయటపెడతానన్నారు. నెల దాటుతోంది కదా?’ అన్న ప్రశ్నకు ‘లేదు లేదు. నేను సిట్‌కే ఇస్తున్నా’ అంటూ ఆయన జవాబిచ్చారు.

చిత్రం.. విష్ణుకుమార్‌రాజు