ఆంధ్రప్రదేశ్‌

ఖరీఫ్ కరుణించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: ఇటీవల కురుస్తున్న వర్షాలు, కృష్ణాడెల్టాకు ముందుగానే నీటి విడుదల రాష్ట్ర రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. ఖరీప్ ఈసారైనా ఆశాజనకంగా ఉంటుందని రైతన్నలు ఆశిస్తున్నారు. ఖరీఫ్‌లో ఆశించిన మేర దిగుబడులు ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండదని వ్యాపారులు భావిస్తున్నారు. గత రెండేళ్లుగా ఖరీఫ్‌లో ఆశించిన మేర వరి సాగు చేయలేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కృష్ణాడెల్టాలో వరి పంటకు దాదాపు అనధికార క్రాప్ హాలీడే ప్రకటించారు. 2015-16 ఖరీఫ్‌లో 15.2 లక్షల హెక్టార్లలో వరిని సాగుకు అంచనా వేయగా, కేవలం 13.99 లక్షల హెక్టార్లలోనే వరి పంట వేశారు. 7.4 మిలియన్ టన్నుల మేర ధాన్యం దిగుబడి సాధించారు. 2016-17 ఖరీఫ్‌లో 15.68 లక్షల హెక్టార్లలో వరి సాగుకు లక్ష్యంగా నిర్ణయించగా, 14.55 లక్షల హెక్టార్లలోనే సాగు చేశారు. అంచనా కంటే 1.13 లక్షల హెక్టార్లలో వరి పంట వేయలేదు. కృష్ణా జిల్లాలో వరి పంట తక్కువగా వేశారు. నాగార్జునసాగర్ నుంచి తగినంత నీరు విడుదల కాకపోవడంతో దాని ప్రభావం వరి సాగుపై పడింది. పట్టిసీమ, పులిచింతల ద్వారా నీటి సరఫరా చేసినా, పంట సాగు విస్తీర్ణం పెరిగేందుకు అంతగా ఉపయోగపడలేదు. దీనికితోడు వర్షపాతం కూడా తక్కువగా ఉండటం దిగుబడులపై ప్రభావం చూపింది. ధాన్యం దిగుబడి కూడా 4.5 మిలియన్ టన్నులకు పడిపోయింది. దీంతో రాష్ట్రానికి తెలంగాణలో పండించిన ధాన్యమే దిక్కయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలంగాణలో 5.33 లక్షల హెక్టార్ల వరి సాగు లక్ష్యం కాగా, గత ఖరీఫ్‌లో 8.65 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, తెలంగాణలో పెరగడం మార్కెట్‌లో బియ్యం లభ్యత, ధరలపై ప్రభావం చూపింది. కృష్ణాడెల్టాలో రెండు సీజన్లనో దాదాపు వరి పంట సాగు చేయలేదు. గోదావరి డెల్టాలో కొంతమేర సాగు చేసినప్పటికీ అక్కడ పండించిన వరి రకాలను పౌర సరఫరాల శాఖ సేకరించి, చౌకధరల దుకాణాల ద్వారా విక్రయిస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉన్న బిపిటి, తదితర రకాల దిగుబడి గత ఖరీఫ్‌లో రాష్ట్రంలో తక్కువగా ఉండటంతో రాష్ట్ర మిల్లర్లు తెలంగాణ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, మార్కెట్‌లో విక్రయించారు. రాష్ట్రంలోని సన్న బియ్యం రకాల ధాన్యం ధర ఎక్కువగా ఉండటంతో తెలంగాణ నుంచి కొనుగోలు చేశారు. దీనివల్ల మార్కెట్‌లో బియ్యం ధరలో పెద్దగా మార్పురాలేదు. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మేల్కొని కృష్ణాడెల్డాకు గోదావరి జలాలను తరలించించింది. గతంలో కంటే భిన్నంగా జూన్‌లోనే సాగునీరు విడుదల చేయడంతో కృష్ణాడెల్టాలో ఈ ఏడాది వరి పంట సాగు సాధారణ స్థాయికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగుకు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకూ 1.56 లక్షల హెక్టార్లలో వరినాట్లు పూర్తయ్యాయి. నెలాఖరుకు నాట్లు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.