ఆంధ్రప్రదేశ్‌

విభజన హామీలు అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: ప్రత్యేక హోదాతోసహా విభజన హామీలను అమలు చేయాలని అఖిలపక్ష సమావేశంలో కేంద్రానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చెసింది. సోమవారంనుంచి ప్రారభంకానున్న పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ఆదివారం పార్లమెంట్ హాలులో కేంద్రం అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి వైస్సాఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎంపీ విజయ సాయిరెడ్డి హాజరయ్యారు. అనంతరం మేకపాటి విలేఖరులతో మాట్లాడుతూ జాతీయ సమస్యలు, ప్రజా సంక్షేమ పథకాలకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని, ఇండో-చైనా సరిహద్దు సమస్యను దౌత్యపరంగా చర్చలద్వారా పరిష్కరించాలని కేంద్రానికి సూచించినట్టు చెప్పారు. ప్రాజెక్టులలో నీటిని నిష్పత్తి ప్రకారం పంచాలని కోరినట్టు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలుండేలా చట్టానికి సవరణలు చేయాలని కోరినట్టు తెలిపారు. ప్రజాస్యామ్యం అపహాస్యం కాకముందే మూడు నెలల్లో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. దేశంలో నెలకొన్న రైతు సమస్యలు, పంటలకు మద్దతు ధర వంటి అంశాలను కేంద్రం పరిష్కరించాలని కోరినట్టు చెప్పారు.