ఆంధ్రప్రదేశ్‌

బలపడనున్న అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 16: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను అనుకుని ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రాగల 24 గంటల్లో ఇది బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం ఆదివారం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.