ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి బాలినేని గృహ నిర్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 16: ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి దళితులను ఆదివారం పరామర్శించడానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మాజీ మంత్రి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డితోపాటు పలువురిని శనివారం అర్ధరాత్రి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో బాలినేని అనుచరులు ఆయన నివాసానికి పెద్దఎత్తున చేరుకుని పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. బాలినేనితోపాటు వైకాపా రాష్ట్ర నాయకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డిని ఒంగోలులో గృహనిర్బంధం చేశారు. అదేవిధంగా పర్చూరు ఇన్‌చార్జ్ గొట్టిపాటి భరత్, బాపట్ల పార్లమెంటు వైకాపా ఇన్‌చార్జ్ అమృతపాణి, చీరాల ఇన్‌చార్జ్ యడం బాలాజీ, వైకాపా ఒంగోలు నగర మాజీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, ఇతర వైకాపా నాయకులను పోలీసులు అరెస్టు చేసి ఒంగోలు, చీరాల, ఇంకొల్లుల్లో పోలీసుస్టేషన్లలో ఉంచారు. సిపిఎంకి చెందిన ఒంగోలు నగర కార్యదర్శి జివి కొండారెడ్డి, సిపిఎం జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, కంకణాల ఆంజనేయులు, శ్రీరాంశ్రీనివాసరావులను పోలీసులు అరెస్టు చేశారు. ఈసందర్బంగా సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలులోని సాగర్ సెంటరులో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముప్పరాజు కోటయ్య, ఎస్‌డి హనీఫ్ మాట్లాడుతూ పోలీసులు అన్యాయంగా వైకాపా, సిపిఎం నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో నియంతపాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. మొత్తంమీద దేవరపల్లి దళిత బాధితులను పరామర్శించి తీరుతామని బాలినేని స్పష్టం చేశారు.

చిత్రం.. వైకాపా నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు