ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 8: ప్రసిద్ధ శ్రీ వైష్ణవాచార్యులు, శ్రీ మహావిష్ణువును శరణాగతిలో కొలిచిన భక్తాగ్రేసరుడు భగవద్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని దేశంలోని 106 వైష్ణవ దివ్యక్షేత్రాల మీదుగా రథయాత్రను నిర్వహించాలని టిటిడి భావించింది. ఇందులో భాగంగా ఈ నెల 10న తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న బేడి ఆంజేయస్వామి ఆలయం నుంచి సంచార రథాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించనున్నారు. ఎంతో ముఖ్యమైన ఈ సంచార రథయాత్ర పూజా కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. భగవద్ రామానుజాచార్యులంటే సాక్షాత్తూ వేయి పడగల ఆదిశేషుని స్వరూపుడని, మొదట వైకుంఠంలో అనంతుడైన ఆదిశేషుడుగానూ, రెండోమారు లక్ష్మణుడుగానూ, మూడోసారి బలరామునిగానూ, కలియుగంలో భగవద్ రామానుజాచార్యులగానూ అవతరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామికి రామానుజాచార్యులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని టిటిడి ఏర్పాటుచేసింది.
తిరుమలలో రామానుజాచార్యుల ముద్ర
కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల ఆది వరాహక్షేత్రమని, తొలి దైవమైన వరాహస్వామికి నిత్యం తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనం అనే నియమాన్ని రామానుజాచార్యుల వారు పునరుద్ధరించారు. తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే మళ్లీ విఖనస మహర్షిగా అవతరించి తన అర్చన విధానాన్ని ఏర్పాటుచేసుకున్నాడని, ఈ నేపథ్యంలో ఎలాంటి లోపం లేకుండా వైఖానస ఆగమ ప్రకారం పూజలు జరగాలని నిర్ణయించిన కర్త రామానుజాచార్యులు. అంతేకాకుండా శ్రీహరి వక్ష స్థలంలో వ్యూహాలక్ష్మిని అందరు దర్శించడం కుదరదని, భక్తులు లక్ష్మిని దర్శించేవిధంగా స్వామివారి వక్ష స్థలంలో ఆభరణంగా అందరికీ కనిపించేలా బంగారు లక్ష్మిప్రతిమను అలంకరింపచేశారు. వక్ష స్థల లక్ష్మితో కూడిని శ్రీనివాసునికి ప్రతి శుక్రవారం అభిషేకం జరగాలని కూడా నిర్ణయించారు. బాగ్ సవారీ, తన్నీరు ముదు ఉత్సవం, తిరుచానూరు పంచమినాడు అమ్మవారికి తిరుమల నుంచి సారె పంపే సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది రామానుజాచార్యులే. రామానుజాచార్యులు శ్రీ భాష్యం, వేదాంత దీప్త:, వేదంత సార:, గీతాభాష్యం, వేదార్థ సంగ్రహ, శరణాగతి గద్య, శ్రీరంగ గద్య, వైకుంఠ గద్య, నిత్యగ్రంధ అనే 9 గ్రంథాలను రామానుజచార్య రచించారు. ఈ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు.