ఆంధ్రప్రదేశ్‌

మార్వాడీ కుటుంబంపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (క్రైం), జూలై 17: విశాఖలో మరో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బీచ్ రోడ్డులో నివాసం ఉంటున్న ఓ మార్వాడీ కుటుంబంపై ఆరుగురు దుండగులు కత్తులు, తుపాకులతో దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల వివరాలు ప్రకారం- బీచ్ రోడ్డులోని సీ సర్ఫ్ అపార్ట్‌మెంట్‌లోని ఆరవ ఫ్లోర్‌లో విక్రమ్ కుటుంబం నివాసం ఉంటోంది. విక్రమ్ క్రేన్‌లను అద్దెకిచ్చే బిజినెస్ చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీల్లో కొద్ది రోజులుగా కొంతమందితో గొడవలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ ఆటోలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చి, వాచ్‌మేన్‌ను అటకాయించి, మెట్ల మార్గంలో నలుగురు విక్రమ్ ఇంటికి వెళ్లారు. ఇద్దరు లిఫ్ట్‌ని పైకి, కిందకు వెళ్లకుండా అందులో ఉన్నారు. విక్రమ్ ఇంట్లో ఆయనతోపాటు, ఆయన భార్య జ్యోతి, డ్రైవర్ జనార్దన్ ఉన్నారు. విక్రమ్ ఇంటికి వెళ్లిన నలుగురిలో ఒకడు తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. మిగిలిన వారు విక్రమ్, జ్యోతి, జనార్థన్‌పై కత్తులతో తీవ్రంగా దాడులు జరిపారు. కేవలం పది నిముషాల వ్యవధిలోనే ఈ దారుణం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెపుతున్నారు. విక్రమ్, జ్యోతి, జనార్దన్ మరణించి ఉంటారని భావించిన ఈ నలుగురు మెట్ల మార్గంలోనే కిందకు దిగి, ఆటోలో వెళ్లిపోయారు. విక్రమ్ కుమారుడు ఆదిత్య ఓం ఈ దాడి నుంచి తప్పించుకుని కింద ఫ్లాట్‌లో ఉంటున్న వారి బంధువు నితీష్‌కు తెలియచేశాడు. వారు వచ్చి చూడగానే విక్రమ్, జ్యోతి, జనార్దన్ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాగా, విక్రమ్ కుమార్తె కుషి అరోరా అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఆడుకుంటోంది. ఈ ఘటనకు పాల్పడింది పంజాబ్‌కు చెందిన వారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి నగర పోలీస్ కమిషనర్ యోగానంద్, క్రైం, లా అండ్ ఆర్డర్ ఎసిపిలు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.