ఆంధ్రప్రదేశ్‌

అధికారుల మెడకు ‘మెడ్‌టెక్’ ఉచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 17: విశాఖ భూ కుంభకోణంలో మరో అతి పెద్ద అవినీతి వెలుగు చూసింది. మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని సేకరించిన ప్రభుత్వం అందులో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన లబ్ధిదారులకు దాదాపు 24 కోట్ల రూపాయలు చెల్లించిన వైనమిది. ఈ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. పరిహారం చెల్లింపులో అక్రమాలు జరుగుతున్నాయని సాక్షాత్తూ జిల్లా మంత్రి అయ్యన్నపాత్రుడే కలెక్టర్‌కు లేఖ రాసినా,దాన్ని బేఖాతరు చేసి, 24 కోట్ల రూపాయలను అప్పనంగా ఆ భూమికి ఏమాత్రం సంబంధం లేని వారికి కట్టబెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సర్జికల్ పరికరాల తయారు చేసే కంపెనీల ఏర్పాటుకు విశాఖ జిల్లా పెదగంట్యాడ రూరల్ మండలం మదీనాబాగ్ కొండవాలు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఇందులో 300 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ భూమి. 2015 ఆగస్టులో మెడ్‌టెక్ పార్క్‌కు సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సర్వే నెంబర్లు 176, 480, 480/1,2,3ల్లో 300 ఎకరాల్లో కేవలం 10-15 ఎకరాల్లో మాత్రమే కొందరు రైతులు జీడి తోటలను పెంచుకుంటున్నారు. అంతకు తప్ప అప్పటి వరకూ అన్యులెవ్వరూ ఆ స్థలంపై హక్కు కలిగి లేరు. ఈ 320 ఎకరాల్లో 270.7 ఎకరాల్లో మెడ్‌టెక్ పార్క్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటికే ఆ భూమిపై జీడి తోటలు పెంచుకుంటున్న వారికి నష్టపరిహారం ఇస్తే సరిపోతుందని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అకస్మాత్తుగా 320 మంది లబ్ధిదారులు పుట్టుకొచ్చారు. వీరి వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, పదవుల్లో ఉన్నవారు ఉండి, కథ నడిపించారు. అప్పటి లా కమిషనర్, పెదగంట్యాడ తహశీల్దార్, విఆర్‌ఓ, ఆర్ తదితరులు అధికార పార్టీ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారు. ఈ భూమితో సంబంధం లేని వారిని లబ్ధిదారులుగా గుర్తించడమే కాకుండా, ఆ భూమిలో వారికి పెద్ద పెద్ద జీడి తోటలు ఉన్నాయ, హుదూద్ తుపానులో అవి నేలకొరిగాయని రికార్డులు సృష్టించారు.
బినామీలకు పరిహారం అందుతోందని మంత్రి అయ్యన్నపాత్రునికి ఆ ప్రాంతం వారంతా వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్న 2-2-2017న కలెక్టర్‌కు లేఖ రాశారు. మరోసారి సర్వే జరిపించి, పరిహారం ఇవ్వాలని ఆయన ఆ లేఖలో కోరారు. కానీ జిల్లా కలెక్టర్ ఆ లేఖను పట్టించుకోలేదు. ఎకరాకు 12 లక్షల రూపాయల చొప్పున 200 మందికి సుమారు 23.65 కోట్ల రూపాయలను పంపిణీ చేసేశారు.
ఈ విషయాన్ని అయ్యన్నపాత్రుడు కొద్ది రోజుల కిందట బయట పెడితే, కలెక్టర్ విచారణ జరిపించారు. ఆర్డీఓ విచారణ జరిపి, సుమారు రెండు కోట్ల రూపాయల వరకూ అక్రమాలు జరిగాయని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఈ నివేదిక కలెక్టర్ దగ్గర ఉంది. మరోపక్క ఈ భూ కుంభకోణానికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించిన మంత్రి అయ్యన్న ఈనెల 19న సిట్‌కు అందచేయనున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, కింది స్థాయి సిబ్బంది వరకూ బెంబేలెత్తిపోతున్నారు.