ఆంధ్రప్రదేశ్‌

టిడిపిపై ఎన్నికల సంఘానికి వైఎస్సాఆర్‌సిపి ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. సోమవారం వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ అచల్ కుమార్ జ్యోతిని కలిశారు. అనంతరం సుబ్బారెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నంద్యాల ఉపఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పది మంది మంత్రులు అక్కడే మకాం వేసి అరాచకాలు చేస్తున్నారని ఆయన మండ్డిపడ్డారు. అధికారులు టిడిపి కొమ్ముకాస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక పారదర్శకంగా జరిగేలా కేంద్ర అధికారులను, బలగాలను అక్కడికి పంపించాలని సిఇసిని కోరినట్టు ఆయన తెలిపారు.