ఆంధ్రప్రదేశ్‌

శ్రీకాకుళానికి వరద గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూలై 17: మూడు రోజులుగా ఒడిశా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నాగావళి నదికి పోటెత్తిన వరద తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే వంశధారకు వరద నీటి ప్రవాహం పెరిగింది. మరో రెండు రోజులు ఒడిశా క్యాచ్‌మెంట్ ఏరియాలో కుండపోత వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే కుట్రగడలో 8.54 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గుడారిలో 4.5, మోహనలో 3.8, మహేద్రగడలో 4.8, కాశీనగర్‌లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. దీంతో వంశధార వరద శ్రీకాకుళానికి వచ్చే ప్రమాదం ఉందంటూ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డితో మాట్లాడి అప్రమత్తం చేసారు. అలాగే మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆదివారం రాత్రికి ప్రమాదస్థాయిలో గల నాగావళి ఉగ్రరూపం ప్రస్తుతం కాస్తా తగ్గింది. ప్రస్తుతం తోటపల్లి బ్యారేజీ వద్ద 8 గేట్లు మూసివేసారు. కేవలం 11.5 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే ప్రవహిస్తోంది. నారాయణపురం వద్ద 94 వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. శ్రీకాకుళం నగరానికి వచ్చేసరికి సోమవారం సాయంత్రానికి 71 వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. ఆదివారం కంటే సోమవారం నాగావళి వరద తగ్గుముఖం పట్టడంతో శ్రీకాకుళానికి వరద ముప్పు తప్పిందని కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి వెల్లడించారు. ఇంతలోనే ఒడిశా క్యాచ్‌మెంట్ ప్రాంతంలో కుండపోత వర్షం వంశధారలో వరద నీటి ప్రవాహాన్ని పెంచేసింది. దీంతో శ్రీకాకుళానికి ‘వరద’గండం నాగావళి నుంచి తప్పినప్పటికీ, వంశధారతో మళ్లీ మొదలుకానున్నదంటూ అధికారులు పరుగులు పెడుతున్నారు. వీరఘట్టాం, పాలకొండ, బూర్జ, ఆమదాలవలస, వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి మండలాల్లో సుమారు 40 గ్రామాల వరకూ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల వరి పంట నీట మునిగింది. మరో రెండు రోజులు పంటలు నీట ఉంటే పూర్తిగా రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉంది. సంతకవిటి మండలం కె.ఆర్.పురం గ్రామం వద్ద నాగావళి గట్టు 25 మీటర్లు మేరకు గండి పడింది. నదీతీర గ్రామాల్లోకి నీరు ప్రవహించడంతో అప్పటికప్పుడే ఆ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు రెవెన్యూ సిబ్బంది తరలించారు. స్థానిక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో కలెక్టర్ మూడు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను ఆ ప్రాంతానికి పంపించారు. వంగర మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన సంగమేశ్వర ఆలయం నాగావళి వరద ముంపునకు గురయ్యింది. భామిని మండలంలో తాళాడ గ్రామానికి చెందిన గోపాలరావు (65) వంశధార నదిలో కొట్టుకుపోయాడు. ఒడిశా కాశీనగర్ మార్కెట్‌కు వెళ్ళి వస్తుండగా వరదలో చిక్కుకుని గల్లంతయ్యాడు. నాగావళి నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండడంతో శ్రీకాకుళం నగరంలో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ కె.్ధనుంజయరెడ్డి, ఎస్పీ త్రివిక్రమవర్మ ముందస్తు చర్యల్లో భాగంగా సోమవారం పలు లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.
ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో గత 24 గంటలుగా కురుస్తున్న కుండపోత వర్షంతో రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. రాయగడ వద్ద రైల్వే బ్రిడ్జి నాగావళి వరద ఉద్ధృతికి పాక్షికంగా కొట్టుకుపోవడంతో పలు రైళ్ళు నిలిచిపోగా, మరికొన్ని రైళ్ళ రాకపోకలను సోమవారం రద్దు చేస్తూ అత్యవసర బులిటెన్ విడుదల చేసింది. ట్రైన్ నెం.12755 సంబల్‌పూర్ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. అలాగే, ట్రైన్ నెం.12756 నాందేడ్ నుంచి సంబల్‌పూర్, ట్రైన్ నెం. 17482 తిరుపతి - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రూట్‌ను విజయనగరం మీదుగా భువనేశ్వర్ - అంగుల్ - సంబల్‌పూర్ రోడ్డు గుండా రాకపోకలు జరగనున్నాయి. శ్రీకాకుళం రోడ్డు నుంచి వెళ్ళే రైళ్ళ రాకపోకల్లో కొన్నింటిని ఇలా రూటు మార్పులు చేసినట్టు అధికారికంగా ప్రకటించారు. రాయగడ వద్ద రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విజయనగరం - రాయగడ - రాయపూర్ వెళ్ళే రైళ్ళు కూడా నిలిచిపోయాయి. 18437 భువనేశ్వర్ - జాంజిఘర్ రోడ్ రైలు నిలుపుదల చేసారు. ట్రైన్ నెం. 18438 జాంజిఘర్ రోడ్డు - భువనేశ్వర్ రైలు నిలిచిపోయింది. రాయఘడ మీదుగా రాకపోకలు చేయాల్సిన రైళ్ళన్నీ తాత్కలికంగా నిలుపుదల చేయగా, మరికొన్ని రైళ్ళ మార్గాన్ని మార్పులు చేర్పులు చేసారు.

చిత్రం.. నాగావళి నదిలో తగ్గుముఖం పట్టిన వరద నీటి ప్రవాహం